అడుగుపెట్టడా… ఏంది?
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడిపోతే పార్టీ మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే చావోరేవోగా కాంగ్రెస్ నేతలు పోరాడుతున్నారు. సిట్టింగ్ సీటును వదులుకుంటే [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడిపోతే పార్టీ మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే చావోరేవోగా కాంగ్రెస్ నేతలు పోరాడుతున్నారు. సిట్టింగ్ సీటును వదులుకుంటే [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడిపోతే పార్టీ మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే చావోరేవోగా కాంగ్రెస్ నేతలు పోరాడుతున్నారు. సిట్టింగ్ సీటును వదులుకుంటే ఇక పార్టీలో పుట్టగతులు కూడా ఉండవనేది స్థానికనేతల టాక్. దీంతో నల్లగొండతో పాటు చుట్టుపక్కల జిల్లాల కాంగ్రెస్ నేతలు, రాష్ట్రస్థాయి లీడర్లు కూడా ప్రచారానికి వెళుతున్నారు. మరోవైపు టి.ఆర్.ఎస్ కూడా ఈ సీటును గెలుచుకునేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. ప్రతి మండలానికో ఇన్ ఛార్జిని నియమించి మరీ ప్రచారం చేస్తోంది.
క్లారిటీ లేని కాంగ్రెస్….
ఇక మొన్నటి వరకు అలకబూనిన స్టార్ క్యాంపెయినర్ పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో అడుగుపెట్టడం లేదు. అందరూ కనపడుతున్నా, ఆయన మాత్రం అసలు అటువైపు చూడడం లేదు. అదే ఇప్పుడు, కాంగ్రెస్ కార్యకర్తల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో విభేదించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి నేటి వరకూ హాజరుకాలేదు. ఇక ముందు కూడా ప్రచారానికి వస్తారో రారో కూడ పార్టీకి క్లారిటి లేదు. దీనికి తోడు పార్టీ ప్రచార కమిటీ ఛైర్మెన్ విజయశాంతి సైతం ఈ ఎన్నికల్లో ఎక్కడా కనపించడంలేదు. ఆమే ఇప్పటి వరకు ఉప ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేదు.
ఉప పోరులో గ్లామర్ ఎక్కడ …
యూత్‌లో క్రేజ్ ఉన్న రేవంత్, మహిళల్లో సినిమా గ్లామర్ ఉన్న రాములమ్మ ఎన్నికల ప్రచారంపై క్లారిటి రాకపోవడంతో పార్టీలో అయోమయం నెలకొంది. ఇద్దరు ముఖ్యనేతలు ప్రచారానికి హాజరుకాకుంటే పార్టీ కార్యకర్తలకు ఏం సమాధానం చెపుతారనే వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది. రేవంత్ వివాదానికి తెరపడాలంటే పీసీసీ అధ్యక్షుడు చొరవ తీసుకుంటేనే సమసిపోతుందని పార్టీలో నేతలు అంటున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు చొరవ తీసుకుంటరో లేక రేవంతే పార్టీ కోసం ఒక అడుగు ముందుకు వేస్తారో చూడాలి.
కుంతియా మాట వినేనా….?
హుజూర్ నగర్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే అక్కడ ఏళ్ల తరబడి బలంగా ఉన్న టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. మరోవైపు రెడ్డి వర్గం కూడా రేవంత్ రెడ్డి మాటలకు ఆకర్షితులై కాంగ్రెస్ కు ఓటువేసే అవకాశాలున్నాయి. ఎవరైనా ఉత్తమ్ రెడ్డి, పద్మావతిలపై కొంత వ్యతిరేకత ఉన్నా రేవంత్ ప్రచారం వల్ల అవి సమిసిపోయే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చనడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే పార్టీకి అంతో ఇంతో లాభమే నంటున్నారు కార్యకర్తలు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా సైతం రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్ ప్రచారంలో పాల్గొనాలని చెప్పినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న రోజుల్లో నైనా రేవంత్ ప్రచారం లో పాల్గొంటారా అనేది సస్పెన్సే.