రోజా వర్సెస్ పెద్దిరెడ్డి.. నగరి రాజకీయాలు హీటెక్కాయ్
అధికార పార్టీ వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య ఉప్పు నిప్పులాగా ఉంది పరిస్థితి అయితే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈ వివాదాలు మరింత [more]
అధికార పార్టీ వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య ఉప్పు నిప్పులాగా ఉంది పరిస్థితి అయితే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈ వివాదాలు మరింత [more]
అధికార పార్టీ వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య ఉప్పు నిప్పులాగా ఉంది పరిస్థితి అయితే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈ వివాదాలు మరింత తారాస్థాయిలో సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ జిల్లా నుంచి మంత్రి కూడా అయిన పెద్దిరెడ్డి అటు పార్టీలోను, ఇటు అధి కారంలోనూ కీలకంగా మారాలని నిర్ణయించుకున్నారు. అయితే, వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు నాయకులు ఈ జిల్లాకు చెందినవారే. పైగా జగన్ దగ్గర పెద్దిరెడ్డికి తిరుగులేకపోవడం ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా. వైసీపీ లోక్‌సభా పక్ష నేతగా ఉండడంతో ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి హవా నడుస్తోంది.
రోజా మాత్రం….?
వారిలో ఒకరు చెవిరెడ్డి భాస్కరరెడ్డి. అయితే, ఈయనను తన కంట్రోల్లోకి తెచ్చుకున్న పెద్దిరెడ్డికి మరో ఫైర్‌బ్రాండ్, వైసీపీ కీలక నాయకురాలు రోజా మాత్రం మింగుడు పడడం లేదు. నగరి నియజకవర్గం నుంచి వరుసగా రెండోసారి కూడా విజయం సాధించిన రోజా కూడా జిల్లాలో అంతో ఇంతో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్లో మంత్రి పదవిని కూడా ఆశించారు. అయితే, సామాజిక సమీకరణల్లో భాగంగా ఆ అవకాశం లబించలేదు. అయితే,దీనివెనుక పెద్దిరెడ్డి చక్రం తిప్పారనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డికి రోజాకు మధ్య గ్యాప్ పెరిగింది.
రోజాను నిలువరించేందుకు….
ఇక, కొన్నాళ్లు పార్టీపైనా అలిగిన రోజా రాజధానికి దూరంగా ఉన్నారు. అయితే, ఇంతలో జగన్ ఏపీఐఐసీ చైర్పర్సన్ వంటి కీలక పదవిని రోజాకు అప్పగించారు. దీంతో ఆమె శాంతించారు. అయినా కూడా రోజాకు చెక్ పెట్టాలని పెద్దిరెడ్డి వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. తన ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో వైసీపీ రెండుగా చీలిపోయింది. నియోజికవర్గంలో ఒక నాయకుడి వ్యవహారం రోజాకు కంట్లో నలుసుగా తయారైంది. ఈయనకు పెద్దిరెడ్డివర్గం అండగా నిలిచింది. ఇదిలావుంటే, తాజాగా స్థానిక సమరంలోనూ రోజాను నిలువరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
రోజాకు చెక్ పెట్టాలని…..
ఈ రెండు గ్రూపుల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజాకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపును ఎంకరేజ్ చేస్తున్నట్టు టాక్. ఇందుకోసం ఎప్పటి నుంచో కాచుకుని ఉన్న ఆయన స్థానిక ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన పెద్దిరెడ్డి నగరి లో తన వర్గానికే మెజారిటీ సీట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు. ఈ లోపు లేడీ సెంటిమెంట్‌తో రోజా కూడా కొన్ని సీట్లు ఆమె వర్గానికి వచ్చేలా చేసారు. ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గం దీనికి విరుగుడు వేసింది. ఈ నియోజికవర్గంలోకి రోజా హవా జీరో చెయ్యాలని తద్వారా ఆమె మంత్రి పదవి ఆశల పై నీళ్లు చల్లాలని పెద్దిరెడ్డి ఫిక్స్ అయ్యారు. అందుకు చాపకింద నీరులా టీడీపీ శ్రేణులకు సహకరిస్తున్నారని వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థులను గెలిపించి రోజాను జీరో చెయ్యాలని ఆర్డర్ వేశారట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక పంథాలో వెళ్తుంటే ఇక్కడ మాత్రం మరో రూటులో ప్రయాణం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.
- Tags
- roja
- à°°à±à°à°¾