రోజా… నువ్వు ఢీకొంటుంది ఎవరినో తెలుసా?
ఆర్ కే రోజా స్వతహాగా సినీనటి. రాజకీయాలకంటే ముందు ఆమె సినిమా నటిగా ఉన్నారు. సినీ గ్లామర్ ఎంత పేరు తెచ్చిపెడుతుందో అంత ఇగోను కూడా ఇస్తుందన్నది [more]
ఆర్ కే రోజా స్వతహాగా సినీనటి. రాజకీయాలకంటే ముందు ఆమె సినిమా నటిగా ఉన్నారు. సినీ గ్లామర్ ఎంత పేరు తెచ్చిపెడుతుందో అంత ఇగోను కూడా ఇస్తుందన్నది [more]
ఆర్ కే రోజా స్వతహాగా సినీనటి. రాజకీయాలకంటే ముందు ఆమె సినిమా నటిగా ఉన్నారు. సినీ గ్లామర్ ఎంత పేరు తెచ్చిపెడుతుందో అంత ఇగోను కూడా ఇస్తుందన్నది ఒక నానుడి. రోజాకు ఇగో ఉందన్నది వాస్తవం. రోజా ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు. కష్టపడి తన గ్లామర్ తోనూ, వాక్పటిమతోనూ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ లో మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన రోజా అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు.
అనేక ఇబ్బందులు పడినా….
తర్వాత రోజా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో నగరి ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రోజా తన వాగ్దాటితో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ప్రతి విషయంలోనూ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. అలాగే అనేకసార్లు అరెస్ట్ చేశారు. అయినా తన రాజకీయ భవిష్యత్ కోసం రోజా అన్నీ భరిస్తూ వచ్చారు.
ప్రయారిటీ లేకపోవడంతో…..
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ రోజాను పెద్దగా పట్టించుకోవడం లేదు. మంత్రివర్గంలో స్థానం ఆశించిన రోజా అది రాకపోవడంతో కొంతకాలం అలిగారు. దీంతో జగన్ స్వయంగా బుజ్జగించి రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇవ్వాల్సి వచ్చింది. ఇక చిత్తూరు జిల్లాలో రోజాకు ఎవరితోనూ పడటం లేదు. ప్రధానంగా చిత్తూరు జిల్లా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యమే నడుస్తుంది. దీనిని ఎవరూ కాదనలేని సత్యమే. అయితే రోజా పెద్దిరెడ్డిని కూడా లెక్క చేయకపోవడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయంటున్నారు.
పెద్దిరెడ్డితో పెట్టుకోవడం వల్లనేనా?
గతంలో చిత్తూరు పర్యటనలో జగన్ కు జిల్లా నేతలపై రోజా ఫిర్యాదు చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి రోజా కు చెప్పకుండానే నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఇది వివాదానికి కారణమయింది. తాను డిప్యూటీ సీఎంనని, తాను ఎక్కడైనా పర్యటించవచ్చని నారాయణస్వామి చెబుతున్నారు. అయితే రోజా గమనించాల్సిన విషయం ఒకటుంది. తాను ఢీకొంటుంది నారాయణస్వామితో కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనన్న విషయాన్ని గ్రహించాలి. ఈ వివాదంలో వైసీపీ అగ్రనేతలు కూడా ఎటూ తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు. రోజా ఇగో తగ్గించుకుంటే జిల్లా రాజకీయల్లో ప్రాధాన్యత ఉంటుందంటున్నారు. లేకుంటే ఇలాంటి అవమానాలు వైసీీపీలో మరిన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.