Rk roja : సరైనోడు వస్తే రోజా పని అయిపోయినట్లేనా?
ఏ రాజకీయ నాయకుడికైనా వరస విజయాలు కష్టమే. కొందరికే అది సాధ్యం. పట్టున్న నాయకులకు, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్, చంద్రబాబు వంటి వారికే అటువంటి అరుదైన వరస [more]
ఏ రాజకీయ నాయకుడికైనా వరస విజయాలు కష్టమే. కొందరికే అది సాధ్యం. పట్టున్న నాయకులకు, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్, చంద్రబాబు వంటి వారికే అటువంటి అరుదైన వరస [more]
ఏ రాజకీయ నాయకుడికైనా వరస విజయాలు కష్టమే. కొందరికే అది సాధ్యం. పట్టున్న నాయకులకు, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్, చంద్రబాబు వంటి వారికే అటువంటి అరుదైన వరస విజయాలు దక్కుతాయి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడినైనా ఒకసారి ఎన్నుకుంటే రెండోసారి అసంతృప్తి ప్రజల్లో పెరగడం సహజమే. అందుకే ఏపీ రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన వారు అతి కొద్ది మంది నేతలు మాత్రమే. అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హ్యాట్రిక్ విజయం దక్కుతుందా? అన్న అనుమానాలు రోజురోజుకూ ఎక్కువయిపోతున్నాయి.
రెండు సార్లు గెలిచి….
ఆర్కే రోజా వైసీపీలో చేరిన తర్వాత మాత్రమే ఎమ్మెల్యే కాగలిగారు. 2014, 2019 ఎన్నికల్లో ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014లో ప్రతిపక్షంలో ఉండటంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అధికారంలో లేకపోవడంతో నగరికి ఏమీ చేయలేకపోయానని రోజా కూడా చెప్పుకోవడంతో 2019 ఎన్నికల్లో మరోసారి ఆమెను ప్రజలు ఆశీర్వదించారు. 2014 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్ల సాధించి విజయాన్ని రోజా దక్కించుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాతే….
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రోజాకు కష్టాలు మొదలయ్యాయి. నగరి ప్రజల్లో రోజా పట్ల అసంతృప్తి ఉందో లేదో తెలియదు కాని సొంత పార్టీ నుంచి మాత్రం ఆమె విపరీతమైన అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక వివాదం రోజాను చుట్టుముడుతూనే ఉంది. ఎంపీపీ ఎన్నికల్లో తలెత్తిన వివాదం ఇంకా సమసి పోలేదు. కేజే కుమార్, మరో వర్గం రోజాకు వ్యతిరేకంగా పార్టీలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
స్వపక్షంలోనే….?
తెలుగుదేశం పార్టీ ఇక్కడ సరిగా లేకపోవడం వల్లనే రోజా గెలుపు సాధ్యమయింది. గాలి ముద్దు కృష్ణమ నాయుడి ఫ్యామిలీలో విభేదాలు రోజాకు అనుకూలంగా మారాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కొంత బలం పుంజుకుంటే చాలు రోజా ఈసారి గెలవడం కష్టమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రోజాకు ఇప్పుడు ప్రజల్లో కంటే స్వపక్షంలోనే శత్రువులు ఎక్కువగా కనపడుతున్నారు. వీటన్నింటి నుంచి రోజా ఎలా బయటపడతారన్నది చూడాలి.