జగనన్న రోజాను సైడ్ చేసేసినట్లేనా?
ఆర్కే రోజా… వైసీపీ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రోజా ఇప్పుడు పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు [more]
ఆర్కే రోజా… వైసీపీ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రోజా ఇప్పుడు పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు [more]
ఆర్కే రోజా… వైసీపీ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రోజా ఇప్పుడు పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు పార్టీలో దొరకడం లేదన్నది రోజా ఆవేదన. ఆర్కే రోజా టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా వైసీపీని ఆమె వచ్చిన వెంటనే ఓన్ చేసుకున్నారు. జగన్ ను తన సోదరుడిగా భావిస్తూ ఆయన వెంటే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 2014లో నగరి నుంచి తొలిసారి గెలిచిన ఆర్కే రోజా విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వెంటే ఉన్నారు. ఎటువంటి ఆపరేషన్ ఆకర్ష్ లకు లొంగలేదు.
విపక్షంలో ఉన్నప్పుడు….
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడంలో రోజా ముందుండే వారు ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. జగన్ మీద ఈగవాలితే సహించని మనస్తత్వం రోజాది. అలాంటి రోజాను జగన్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. రోజా గత ఎన్నికల సమయంలో తన నగరి నియోజకవర్గానికే పరిమితం కాలేదు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి వైసీపీ తరుపున ప్రచారం చేశారు.
సొంత సామాజికవర్గం నేతలే…..
ఇప్పుడు రోజాకు సొంత సామాజికవర్గం నేతలే శత్రువులయ్యారు. వారే ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. రోజాకు ఎర్త్ పెట్టేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని జగన్ దృష్టికి స్వయంగా రోజా తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అంటే జగన్ రోజా కంటే మరో నేతకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్న విషయం రోజాకు అర్థమయింది. తనకు తెలియకుండా తన శత్రువుకే కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని అప్పజెప్పిన దగ్గర నుంచి రోజా అసంతృప్తికి గురవుతున్నారు.
పక్కన పెట్టేసినట్లేనా?
ఇప్పుడు రోజా పరిస్థితిని చూస్తుంటే చెప్పకనే తెలుస్తోంది. అధికారులే ఆమె మాటలను ఖాతరు చేయడం లేదు. ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. గత కొంతకాలం నుంచి రోజాను నియంత్రించేందుకు మరో వర్గానికి వైసీపీ లో కీలక నేతలు మద్దతిస్తున్నారు. తిరుపతి వచ్చిన జగన్ కు రోజా అన్ని విషయాలూ చెప్పారు. అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులేదు. అందుకే రోజా బయట పడ్డారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద రోజాను జగన్ సైడ్ చేసినట్లే కన్పిస్తుంది.