గుదిబండగా మారిందిగా?
అసలే అంతంత మాత్రంగా ఉన్న జగన్ ప్రభుత్వానికి ఆర్టీసీ గుదిబండగా మారింది. ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం లక్షలాది [more]
అసలే అంతంత మాత్రంగా ఉన్న జగన్ ప్రభుత్వానికి ఆర్టీసీ గుదిబండగా మారింది. ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం లక్షలాది [more]
అసలే అంతంత మాత్రంగా ఉన్న జగన్ ప్రభుత్వానికి ఆర్టీసీ గుదిబండగా మారింది. ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం లక్షలాది ఆర్టీసీ కుటుంబాల్లో ఆనందం నింపింది. ఆర్టీసీ కార్మికుల జీతాలను ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం దానిని వదలడం లేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ఆర్టీసీ కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది.
ఎప్పుడూ నష్టాలే…..
ఆర్టీసీ ఎప్పుడూ లాభాల్లో ఉండదు. ప్రజాసేవ కోసం ఏర్పాటు చేసిన ప్రజా రవాణా వ్యవస్థ కావడంతో అప్పుడప్పుడు తప్ప లాభాల బాట పట్టింది అతి తక్కువ సమయాల్లో మాత్రమే. ఏపీఎస్ ఆర్టీసీ కరోనా కారణంగా రోజుకు 12 కోట్లు నష్టపోయిందని అధికారులు లెక్కలు వేశారు. దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ కారణంగా వందల కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూడాల్సి వచ్చింది. కరోనా తగ్గిన తర్వాత కూడా ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉందని చెబుతున్నారు.
కరోనా తర్వాత…?
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆక్యుపెన్సీ రేటు పెరగకపోవడం అధికారుల్లో ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకువచ్చి సంస్థను నడుపుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వమే భరిస్తున్నా దాని నిర్వహణ ఖర్చు తడిసి మోపెడెంత అవుతుంది. రోజుకు 42 లక్షల కిలోమీటర్ల వరకూ ఆర్టీసీ బస్సులు తిరుగాయి. వీటి నిర్వహణ కోసం ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది.
బ్యాంకు అప్పులు.. వడ్డీలు….
పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిర్వహణ భారం మరింత పెరిగింది. ఇప్పటికే బ్యాంకుల నుంచి నాలుగువేల కోట్లకు పైగానే అప్పులు తీసుకువచ్చింది. వీటికి వడ్డీలు చెల్లించడం కూడా భారంగానే మారింది. కరోనా సమయంలో దాదాపు 2,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఆర్టీసీని గాడిన పడేయాలంటే ప్రభుత్వం చేయి అందించక తప్పదు. కానీ ప్రస్తుతమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఆర్టీసీని ఆదుకోవడం ప్రభుత్వం వల్ల కూడా కాని పని. దీంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.