సబ్బం హరికి అంతేకావాలా?
తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో అత్యంత ప్రధానమైనది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పొలిట్ బ్యూరో ప్రధాన భూమిక పోషిస్తుంది. నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్నప్పటికి దానికి [more]
తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో అత్యంత ప్రధానమైనది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పొలిట్ బ్యూరో ప్రధాన భూమిక పోషిస్తుంది. నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్నప్పటికి దానికి [more]
తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో అత్యంత ప్రధానమైనది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పొలిట్ బ్యూరో ప్రధాన భూమిక పోషిస్తుంది. నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్నప్పటికి దానికి ఆమోదముద్ర వేయాల్సింది పొలిట్ బ్యూరో మాత్రమే. విధానపరమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో కూడా పొలిట్ బ్యూరో ప్రధానపాత్ర పోషించనుంది. అయితే ఈ పొలిట్ బ్యూరోలో కీలక నేత సబ్బం హరికి చంద్రబాబు చోటు కల్పించలేదు.
టీడీపీ తరుపున పోటీ చేసి……
నిజానికి సబ్బం హరి మొన్నటి ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ తరుపున భీమిలి నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సబ్బం హరి పార్టీ కండువా కప్పుకున్నారో? లేదో కూడా తెలియదు కాని అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు బీఫారంమాత్రం ఇచ్చింది. అయితే ఆయన అధికారికంగా పార్టీలో చేరలేదంటారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే పోటీ చేయడంతో సబ్బం హరిని టీడీపీ నేతగానే పరిగణించాల్సి వస్తుంది.
బలమైన గొంతుకగా….
ఎన్నికల ఫలితాల నుంచి సబ్బం హరి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతలు మౌనంగా ఉన్నా సబ్బం హరి మాత్రం తన నోటికి పదును పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పు పడుతూ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారారు. మూడు రాజధానుల ప్రతిపాదనను సయితం సబ్బం హరి విశాఖ నుంచే వ్యతిరేకించి టీడీపీ గొంతుకగా మారారు.
పొలిట్ బ్యూరోలో…?
అలాంటి సబ్బం హరికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొందరు మాత్రం ఆయన పార్టీలో చేరలేదని అంటున్నారు. పార్టీలో చేరకపోయినా టీడీపీ తరుపున బలమైన వాయిస్ ను విన్పిస్తున్న సబ్బం హరిని పొలిట్ బ్యూరోలో తీసుకోవాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద సబ్బం హరి ఇటు టీడీపీలో ఉన్నారా? లేక మద్దతుదారుగానే కొనసాగుతారా? అన్న చర్చ జోరుగా సాగుతుంది.