ఇక ముగించినట్లేనా?
సబ్బంహరి.. సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ హయాంలో ఎంపీగా గెలిచిన ఈయన రాజకీయంగా అనేక ఉన్నత పదవులు ఆశించారు. అయితే, అవి ఆయనకు చేరువ కాలేదు. కాంగ్రెస్ [more]
సబ్బంహరి.. సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ హయాంలో ఎంపీగా గెలిచిన ఈయన రాజకీయంగా అనేక ఉన్నత పదవులు ఆశించారు. అయితే, అవి ఆయనకు చేరువ కాలేదు. కాంగ్రెస్ [more]
సబ్బంహరి.. సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ హయాంలో ఎంపీగా గెలిచిన ఈయన రాజకీయంగా అనేక ఉన్నత పదవులు ఆశించారు. అయితే, అవి ఆయనకు చేరువ కాలేదు. కాంగ్రెస్ హయాంలో అనకా పల్లి నుంచి ఎంపీగా గెలిచిన ఆయన సమైక్య రాష్ట్ర ఉద్యమ సమయంలో తనవాయిస్ బాగానే వినిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. వైఎస్ ఉన్నప్పుడు వైఎస్ మీద మీడియా చర్చల్లో ఈగ కూడ వాలనిచ్చే వారు కాదు. ఆ తర్వాత వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డికి కాంగ్రెస్ ఎంపీగానే ఉంటూ సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన నిరసిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే 2014లో ఎన్నికలకు దూరంగా కూడా ఉన్నారు. ఇక, అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయ పరిణామా లను విశ్లేషిస్తూ.. తనదైన ముద్ర వేసుకున్నారు.
టీడీపీకి అనుకూలంగా…
కొన్ని రోజులు వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపినా.. పార్టీలో నాయకులంటే.. పార్టీ అధినేత జగన్కు విలువలు లేవని…. అందరిని చిన్నచూపు చూస్తున్నారని వ్యాఖ్యానించి ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి మళ్లీ రాజకీయ విశ్లేషకుడిగా అవతారం ఎత్తడం, అదే సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేయ డం ద్వారా చంద్రబాబు అనుకూల మీడియాలో ప్రచారం పొందారు. ఇక, ఎన్నికల ముందు టీడీపీపై ఆశలు పెట్టుకున్నారు. ఆయనే ఈ పార్టీలోకి వెళ్లారో.. లేక పార్టీ అధినేతే ఆయనను ఆహ్వానించారో కానీ.. భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు.
జగన్ సునామీలో…
జగన్ సునామీ నేపథ్యంలో సబ్బం ఓటమి పాలయ్యారు. ప్రస్తుత పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ సబ్బం హరిపై విజయం సాధించారు. అయితే, ఎన్నికలకు ముందు టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన ఆయన తర్వాత టికెట్ తీసుకుని పోటీ చేసినా.. ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి అంటీ ముట్ట నట్టు వ్యవహరిస్తున్నారు. అలాగని వైసీపీకి కూడా దగ్గర కావడం లేదు. కనీసం ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరోపక్క, విశ్లేషణలను కూడా తగ్గించుకున్నారు.ఎన్నికలకు ముందు వరకు టీడీపీ అధినేతను ఆకాశానికి ఎత్తేసిన ఆయన జగన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనకు రాజకీయంగా భిక్ష పెట్టిన కాంగ్రెస్ను వదులుకుని, ఇటీవల ఎన్నికల్లో టీడీపీకి దగ్గరైనప్పటికీ.. ఆయన పార్టీలో పట్టు సాధించకపోగా.. కేవలం విశ్లేషకుడిగానే కాలం గడుపుతున్నారు మరి ఆయన వ్యూహం ఏంటి? టీడీపీలో ఉంటారా? లేక.. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంటుంది.