సలహాదారుపైనే గుర్రు…ఎందుకలాగ?
ప్రభుత్వసలహాదారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు విపక్షాలకు టార్గెట్ అయ్యారు. మంత్రులను ఆయన శాస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనికి కారణం కేవలం హోం [more]
ప్రభుత్వసలహాదారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు విపక్షాలకు టార్గెట్ అయ్యారు. మంత్రులను ఆయన శాస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనికి కారణం కేవలం హోం [more]
ప్రభుత్వసలహాదారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు విపక్షాలకు టార్గెట్ అయ్యారు. మంత్రులను ఆయన శాస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనికి కారణం కేవలం హోం శాఖలో జరిగే పరిణామాలేనని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెడుతుండటం, గత ప్రభుత్వ హయాంలో అవినీతి తిరగదోడటం వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందన్నది విపక్షాల అనుమానం.
డమ్మీగా మార్చారంటూ….
అందుకే హోంమంత్రి డమ్మీగా మారారన్న ఆరోపణలను వారు చేస్తున్నారు. హోమంత్రిత్వ శాఖఫై సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం చేస్తున్నారని, డీజీపీ సయితం ఆయన చెప్పినట్లే నడుచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వరసగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు ఏబీ వెంకటేశ్వరరావుపై మరో కేసు నమోదు చేయడం వంటి అంశాలతో పాటు ధూళిపాళ్ల నరేంద్ర మొదలు అచ్చెన్నాయుడు అరెస్ట్ వరకూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందన్నది టీడీపీ ఆరోపణ.
జగన్ అనుమతి లేకుండా…?
అందుకే ఇటీవల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డిని టీడీపీ టార్గెట్ చేస్తుంది. సహజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు కొంత సన్నిహితంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ ను సజ్జల జగన్ కు చేరవేస్తుంటారు. జగన్ అనుమతి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరన్నది వైసీపీ నేతలు చెబుతారు. కేవలం సమాచారం చేరవేసే పనినే సజ్జల చేస్తున్నారంటారు. అయితే టీడీపీ మాత్రం షాడో హోమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తుంది.
ఎప్పుడైనా? ఎక్కడైనా?
సహజంగా హోంమంత్రి ఏ ప్రభుత్వంలోనైనా ఉత్సవ విగ్రహంలా ఉంటారనేది వాస్తవం. చంద్రబాబు హయాంలోనూ నిమ్మకాయల చినరాజప్పకు తెలియకుండా బదిలీలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. లోకేష్ చెప్పినట్లే హోంశాఖలో అన్నీ జరిగేవని అప్పట్లో కడా విమర్శలు విన్పించాయి. ఇప్పుడు కూడా అంతే కావచ్చు. హోంమంత్రి ఎవరున్నా అందులో ముఖ్యమంత్రి ఆలోచనలే అమలు జరుగుతాయన్నది కాదనలేని వాస్తవం. అది చంద్రబాబు కానీ, జగన్ కానీ ఎక్కడైనా, ఎప్పుడైనా హోంమంత్రి డమ్మీనే. ఈ విషయం తెలిసీ సజ్జల రామకృష్ణారెడ్డిని టీడీపీ టార్గెట్ చేయడం విశేషం.