హే… రాజన్… అంతలోనే ఏమైంది?
ఆయన వైఎస్ కాలం నాటి పాతకాలపు మనిషి. ఒకరిని నమ్మితే అలాగే ఉంటారు. మంచిగా ఉండడం అంటే ఆయన్ని చూసే నేర్చుకోవాలి. తనకు ప్రజలు అంటే చాలా [more]
ఆయన వైఎస్ కాలం నాటి పాతకాలపు మనిషి. ఒకరిని నమ్మితే అలాగే ఉంటారు. మంచిగా ఉండడం అంటే ఆయన్ని చూసే నేర్చుకోవాలి. తనకు ప్రజలు అంటే చాలా [more]
ఆయన వైఎస్ కాలం నాటి పాతకాలపు మనిషి. ఒకరిని నమ్మితే అలాగే ఉంటారు. మంచిగా ఉండడం అంటే ఆయన్ని చూసే నేర్చుకోవాలి. తనకు ప్రజలు అంటే చాలా ఇష్టం ప్రజాసమస్యలు తీర్చడం మరీ ఇష్టం. ఆయన ఒకసారి కాదు మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయినా సరే ఆయన నివాసం చాలా సామాన్యంగా ఉంటుంద్. పేదలు అతి సునాయాసంగా ఆయన వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయనే విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర. ఆయన వద్దకు జనం వస్తే వారి సమస్యలు నూరు శాతం తీర్చేవరకూ ఆయన నిద్రపోరు. వాటి కోసం తన ప్రభుత్వమైనా, వేరే ప్రభుత్వమైనా కూడా కాలికి బలపం కట్టుకుని తిరుగుతారు. అంత చిత్తశుద్ధి ఆయనకు ఉంది. ఆయన నియోజకవర్గంలో మావోయిస్టుల సమస్యలు ఉన్నాయి. అయినా సరే ఆయన జోలికి వారు రారు. ఎందుకంటే ఆయన గిరిజనానికి ఇష్టుడు కాబట్టి. వారి సమస్యలపైన ఎక్కువగా పోరాటం చేస్తారు కాబట్టి. మరి ఇంతటి సీనియర్ ఎమ్మెల్యేకు జగన్ అన్యాయం చేశారా…?
మంత్రి పదవి కోసమా…?
సాధారణంగా పదవుల మీద రాజన్నదొరకు మక్కువ తక్కువ అంటారు. ఆయన ప్రజల సమస్యల సాధనలోనే ఎక్కువ ఆనందం పొందుతారు. అందువల్లనే ఆయన నమ్ముకున్న పార్టీలోనే కొనసాగారు. ఆయన్ని టీడీపీ లాంటి పార్టీలు ఆకర్షించలేకపోవడానికి కూడా అధికార లాలస, పదవీ వ్యామోహం ఆయనకు లేకపోవడమే ప్రధాన కారణం. అటువంటి రాజన్నదొర మనసు ఇపుడు మారిందా, మంత్రి పదవి మీద మోజు పెంచుకుందా అన్న సందేహాలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే ఎస్టీ కోటాలో రాజన్నదొరకే అవకాశం అనుకున్నారంతా. అయితే చిత్రంగా రెండవమారు గెలిచిన కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. దాంతో రాజన్నదొర కొంత మనస్తాపం చెందారని ప్రచారమూ అప్పట్లో జరిగింది. సమీకరణలతో పాటు, కొన్ని రాజకీయ కారణాల వల్ల జగన్ పుష్ప శ్రీవాణికి పదవి ఇచ్చారని అంటారు. ఇక రాజన్నదొరకు ప్రభుత్వ విప్ పదవిని జగన్ ఇచ్చారు. అయినా ఆయనలో అసంతృప్తి పోలేదని అంటున్నారు.
బొత్స వల్లేనేనా…?
విజయనగరం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కారణంగానే రాజన్నదొరకు మంత్రి పదవి రాలేదన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. రాజన్నదొర బొత్స వర్గంలో లేరని అంటారు. ఆయన తన పని తాను చేసుకునే రకం. పైగా జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. డైరెక్ట్ గా అధినేతతో సంబంధాలు కలిగిన నేత. జిల్లా వైసీపీలో మొదట చేరిన నాయకుడుగా, నిజాయతీపరుడైన గిరిజన నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. అందువల్ల ఆయనకు పదవి ఇస్తే డామినేట్ చేస్తారన్న కారణంగా బొత్స వర్గం పక్కన పెట్టించిందని చెబుతారు. ఇక రాజన్నదొర అసంతృప్తికి మరో కారణం గిరిజన సలహా మండలి చైర్మన్ పదవి అయినా ఇవ్వకపోవడం, క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఈ పదవిని కూడా పుష్ప శ్రీవాణికే జగన్ ఇచ్చేశారు. దాంతో రాజన్నదొర మరింతగా నిరాశ పడ్డారని అంటున్నారు. తన పట్ల జగన్ చిన్న చూపు చూస్తున్నారన్న ఆవేదన దొరలో ఉంది. అది ఎటు దారితీస్తుందో చూడాలి. అయితే జగన్ మాత్రం అవకాశాలు అందరికీ ఉంటాయని చెబుతున్నందువల్ల రాజన్నకు రాజయోగం మరో సారి రావచ్చేమో.. వేచి చూడాలి మరి.