ఓ బేబీ మూవీ రివ్యూ ( రేటింగ్: 3.0/5 )
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ నటీనటులు: సమంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్, తేజ్, అడవి శేష్, స్నిగ్ద, ప్రగతి, జగపతి బాబు తదితరులు. [more]
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ నటీనటులు: సమంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్, తేజ్, అడవి శేష్, స్నిగ్ద, ప్రగతి, జగపతి బాబు తదితరులు. [more]
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
నటీనటులు: సమంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్, తేజ్, అడవి శేష్, స్నిగ్ద, ప్రగతి, జగపతి బాబు తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్ధికి
నిర్మాత: సురేష్ బాబు, సునీత తాటి
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: నందిని రెడ్డి
ఈమధ్యకాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే టాప్ హీరోయిన్ సమంత కూడా అలాంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే మక్కువ చూపుతుంది. అందులోను సమంత పెళ్లయ్యాక ఆమెకు స్టార్ హీరోల సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. అయితే హీరోల సినిమాల్లో ఇంపార్టెన్స్ రోల్స్ చేసేకన్నా హీరోయిన్స్ కి అధిక ప్రాధాన్యత నిచ్చే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలైతే ఏమిటి అనుకున్న సమంత… గత ఏడాది ‘యు టర్న్’ సినిమా చేసి హిట్ కొట్టింది. ఇక తాజాగా కొరియన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ‘మిస్ గ్రానీ’ సినిమా మీద సమంత మనసు పారేసుకోవడమే కాదు.. ఎంతో ఇష్టపడి ‘అలా మొదలైంది, కల్యాణ వైభోగమే’ చిత్రాల తో దుబారా పేరు తెచ్చుకున్న నందిని రెడ్డి తో ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని రీమేక్ చేయించింది సమంత. దానికి తోడు ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ తోడవడం, అలాగే ఈ సినిమాలో 70 ఏళ్ళ ముసలి బామ్మ హావభావాలతో సమంత నటించడం వంటి ఆసక్తికర అంశాలతో ఈ ‘ఓ బేబీ’ చిత్రం తెరకెక్కింది. 70 ఏళ్ళ ముసలావిడ.. అనుకోకుండా టీనేజ్ అమ్మాయిగా మారుతుంది. మరి కాన్సెప్ట్ ప్రేక్షకులకు ముందే తెలిసినా.. ఈ సినిమా ప్రమోషన్స్ తో సినిమా మీద ప్రేక్షకుల్లో సమంత పిచ్చ ఆసక్తి రేకెత్తించింది. టీజర్, ట్రైలర్, ప్రోమోలు ఆసక్తికరంగా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ సమంత చాలా ధీమాగా ఉంది. మరి సమంత నమ్మకం ఎంతవరకు ‘ఓ బేబీ’ సినిమా నిజం చేసింది? నందిని రెడ్డి ‘ఓ బేబీ’ తో సూపర్ హిట్ కొట్టిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
70 ఏళ్ల వృద్ధురాలైన బేబి (లక్ష్మీ) చిన్నతనం నుండి ప్రతి విషయంలోనూ రాజీ పడుతూ ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తుంది. పెళ్లైన ఏడాదిలోనే భర్తను కోల్పోయి.. కొడుకు (రావు రమేష్)ని ప్రయోజకుడ్ని చేస్తుంది. కొడుకు (రావు రమేష్)పై విమరీతమైన ప్రేమ ఉండటంతో పాటు బేబీకి వయసుతో పాటుగా కాస్త చాదస్తం పెరుగుతుంది. ప్రతి విషయం తనకే కావలనంటూ.. అన్ని విషయాల్లోనూ కల్పించుకుని ఇంట్లోవాళ్లను తిడుతూ ఉంటుంది. దీంతో బేబీ టార్చర్ భరించలేక కోడలు (ప్రగతి)కి గుండెనొప్పి వస్తుంది. బేబీ ఇంట్లో ఉంటే ప్రగతి మామూలు మనిషి కావడం కష్టం అని డాక్టర్లు చెప్పడంతో ఇంట్లో నుండి వెళిపోదాం అని బేబీ డిసైడ్ అయిన సందర్భంలో కథలో కీలక మలుపు ఉంటుంది. ఒక ఫోటో కోసం ఫోటో స్టూడియో లోకి వెళ్లిన బేబీ అనుకోకుండా 24 ఏళ్ల స్వాతిగా (సమంత) మారుతుంది. బేబీ యవ్వనములోకి మారిన తరవాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు బేబీ.. స్వాతిగా ఎలా మారింది? స్వాతిగా మారిన తరువాత ఎలాంటి ఛాలెంజ్‌లను ఎదుర్కొంది? బేబీ అనుకున్నవన్నీ సాధించిందా? అసలు చివరకు ఏం జరిగింది? అనేది ఓ బేబీ మిగతా కథ.
నటీనటుల నటన:
గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్న అక్కినేని కోడలు… ఇపుడు ‘ఓ బేబి’గా మరోసారి ఆడియన్స్‌ను మాయ చేసింది. ‘ఓ బేబి’ సినిమాకు కర్త,కర్మ, క్రియ అన్ని సమంతనే. ‘ఓ బేబి’గా సమంతను ఒకసారి చూసిన తర్వాత మరెవరినీ ఊహించుకోలేము. నిజంగానే ఒక ముసలావిడ పడుచుపిల్లగా మారితే.. ఎలా ఉంటుందో… మొహం లోని ఆ హావభావాలను చక్కగా పండించింది. ముఖ్యంగా ముసలావిడ నుంచి యంగ్‌గా మారే క్రమంలో సమంత పండించిన కామెడీ నటన బాగుంది. సమంత కామెడీ టైమింగ్ కూడా అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. తన చాదస్తంతో సినిమాలో నవ్వించింది.. ఏడిపించింది.. కవ్వించింది.. మెరిసింది.. మైమరపించింది సమంత. మరోవైపు పెద్దావిడగా సీనియర్ నటి లక్ష్మి గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అహంభావంతో పాత్రలను పోషించిన లక్ష్మీ..ఈ సినిమాలో కాస్తంత చాదస్తం ఉన్న అత్తగారి పాత్రలో జీవించింది. హీరోగా నటించిన నాగశౌర్య ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. సమంతను ప్రేమించే ప్రేమికుడిగా అతని నటన ఆకట్టుకుంటోంది. మరోవైపు లక్ష్మీ కొడుకు పాత్రలో నటించిన రావురమేష్, కొడలి పాత్రలో నటించిన ప్రగతితో పాటు మిగతా పాత్రల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్,జగపతి బాబు, మనవడిగా నటించిన తేజ తదితరులు తమ పాత్ర పరిధి మేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
ఈ కాన్సెప్ట్ ముందుగానే చాలా మందికి తెలిసినా వెండి తెరపై చూసినప్పుడు సరికొత్తగానే ఉన్నట్టు అనిపిస్తుంది. వయసులో పెద్దగా ఉన్న వారు యుక్త వయసులోకి మారితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ ను దర్శకురాలు నందిని రెడ్డి చాలా చక్కగా బ్యాలన్స్ చేస్తూ తీసుకెళ్లింది. ముఖ్యంగా ఈ స్టోరీకి సమంతను సెలెక్ట్ చేయడంలోనే నందినీ రెడ్డి సగం సక్సెస్ అయ్యారు. మొత్తంగా నందిని రెడ్డి తానూ రెడీ చేసుకున్న కథను అంతే పకడ్బందీగా తెరకెక్కించింది. ఆమె దేవుడి వరంతో యంగ్ మారడం.. లాంటివి లాజిక్‌గా దూరంగా ఉన్నా ఓవరాల్‌గా పర్వాలేదు. ఫస్టాఫ్ మొత్తం ఫన్ రైడ్‌గా నడిపించిన నందినీ రెడ్డి సెకండాఫ్‌లో కాస్త తడబడింది. కథ ముందే రివీల్ కావడంతో పాటు.. క్లైమాక్స్ ఏమౌతుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కొరవడింది. కామెడీతో పాటు ఎమోషన్స్ సీన్స్‌కి పెద్ద పీట వేసిన నందినిరెడ్డి కథనంపై కాస్త గ్రిప్పింగ్ కోల్పోయింది. కథానుసారం వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో నందిని రెడ్డి కాస్త జాగ్రత్త పడినట్లైతే సినిమా స్థాయి పెరిగేది. కాకపోతే సినిమా స్లో అవుతుందనే సందర్భంలో బలమైన ఎమోషన్ సీన్స్‌తో బాలెన్స్ చేసి మొత్తానికి పూర్తిగా క్లాస్ టచ్‌తో ఏ క్లాస్, మల్టీప్లెక్స్ ప్రేక్షకుల టేస్ట్‌కు తగ్గట్టు ఉన్న ఈ సినిమాకు బీ,సీ సెంటర్ మాస్ ఆడియన్స్ ఆదరణ ఏ మేరకు దక్కుతుందో చూడాలి.
సాంకేతికంగా… మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సో సో గా ఉన్నప్పటికీ… నేపధ్య సంగీతం మాత్రం బావుంది. మ్యూజిక్ లో మాత్రం అంత పస లేదు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. సమంతను చాలా అందంగా న్యూ లుక్‌లో చూపించారు. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా మలిచారు. మ్యూజిక్ కాంపిటేషన్ సీన్స్‌ను రిచ్‌గా చూపించారు. ఎడిటర్ జునైద్ సిద్ధికీ సినిమా రన్ టైంని మరింత తగ్గిస్తే బాగుండేది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: సమంత నటన, ఫస్ట్ హాఫ్, సినిమాటోగ్రఫీ, నందిని రెడ్డి డైరెక్షన్
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, నిడివి, మ్యూజిక్
రేటింగ్: 3.0/5