కెలికి మరీ కీడు చేస్తున్నాడే
నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. అదీ సంకీర్ణ సర్కార్ లో ఉన్నప్పుడు మరీ అప్రమత్తంగా ఉండాలి. పాత విషయాలను రేపి కెలుక్కుంటూ శివసేన తన [more]
నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. అదీ సంకీర్ణ సర్కార్ లో ఉన్నప్పుడు మరీ అప్రమత్తంగా ఉండాలి. పాత విషయాలను రేపి కెలుక్కుంటూ శివసేన తన [more]
నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. అదీ సంకీర్ణ సర్కార్ లో ఉన్నప్పుడు మరీ అప్రమత్తంగా ఉండాలి. పాత విషయాలను రేపి కెలుక్కుంటూ శివసేన తన ప్రభుత్వాన్ని తానే కూలదోసుకునే పరిస్థిితికి వచ్చింది. మహారాష్ట్రలో శివసేన,కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే సంకీర్ణంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇవేవీ వచ్చి పడినివి కావు. కావాలని తెచ్చిపెట్టుకున్నవే. ముఖ్యంగా శివసేన కొరివితో తలగోక్కున్నట్లుంది. ఇందుకు ప్రధాన కారణం శివసేన నేత సంజయ్ రౌత్.
ఎప్పుడూ వివాదమే….
సంజయ్ రౌత్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయన జర్నలిస్ట్ గా అనుభవం ఉన్నప్పటికీ తరచూ కాంట్రవర్సీకి కేరాఫ్ గా ఉంటారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర సంకీర్ణలో కాక రేపుతున్నాయి. సంకీర్ణంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందన్న సంగతి సంజయ్ రౌత్ కు తెలుసు. కాంగ్రెస్ మద్దతు లేకుంటే తమ అధినేత ఉద్ధవ్ ముఖ్యమంత్రి కాలేడన్నది కూడా సంజయ్ రౌత్ కు తెలియంది కాదు.
ఇందిరపై వ్యాఖ్యలతో….
అయినా సంజయ్ రౌత్ సంకీర్ణ సర్కార్ లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ నేత ఇందిరాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయి డాన్ కరీంలాలాను కలిసేందుకు ఇందిరాగాంధీ ముంబయి వచ్చే వారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అప్పట్లో పోలీస్ కమిషనర్ ఆఫీసులో, సెక్రటేరియట్ లో అధికారులు ఎవరెవరు ఉండాలన్నది దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లు నిర్ణయించేవారని సంచనల వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఇందిరాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతోంది.
కాంగ్రెస్ సీరియస్….
అయితే వివాదం మరింత పెరుగుతుందని భావించిన సంజయ్ రౌత్ వెంటనే నష్టనివారణ చర్యకు దిగారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారని ట్వీట్ చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. గతంలోనూ వీర సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను శివసేన ఖండించింది. మొత్తం మీద శివసేన సజావుగా సాగిపోతున్న సమయంలో సమస్యలను తనంతట తానుగా తెచ్చిపెట్టుకున్నట్లుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రెండు పార్టీలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద సంజయ్ రౌత్ తరచూ సంకీర్ణ భాగస్వామిని కెలుకుతుండటం ఉద్ధవ్ కు కూడా ఇబ్బందిగా మారింది.