పవార్ చెప్పిందే నిజమైతే… ?
మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ స్టార్టయింది. ఒకవైపు శివసేనను మంచి చేసుకోవడం, మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను చేరదీయడం లక్ష్యంగా ఆపరేషన్ మొదలయిందంటున్నారు. బీజేపీ ప్రయత్నాలు సక్సెస్ [more]
మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ స్టార్టయింది. ఒకవైపు శివసేనను మంచి చేసుకోవడం, మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను చేరదీయడం లక్ష్యంగా ఆపరేషన్ మొదలయిందంటున్నారు. బీజేపీ ప్రయత్నాలు సక్సెస్ [more]
మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ స్టార్టయింది. ఒకవైపు శివసేనను మంచి చేసుకోవడం, మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను చేరదీయడం లక్ష్యంగా ఆపరేషన్ మొదలయిందంటున్నారు. బీజేపీ ప్రయత్నాలు సక్సెస్ అయితే మరో రెండు మూడు నెలల్లో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశముందని చెబుతున్నారు. తొలిదఫా చేసిన తప్పును మళ్లీ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేయాలని కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై…..
ఈమేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ఎక్కువగా అసమ్మతి ఉన్నట్లు గుర్తించింది. కొంతకాలంగా వీరిని ఉద్ధవ్ పట్టించుకోక పోవడం, ఎన్సీపీకి ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వకపోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అలాగే మంత్రివర్గంలో స్థానం దక్కలేదని దాదాపు అరడజను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు బీజేపీ గుర్తించినట్లు చెబుతున్నారు.
పవార్ ను దారిలోకి తెచ్చుకోవాలనుకున్నా….
తొలుత పెద్దతలకాయకే బీజేపీ వల వేసింది. శరద్ పవార్ ను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఆయన ససేమిరా అనడంతో శివసేనకు సంకేతాలు పంపింది. ఇద్దరం కలసి పనిచేయడానికి సిద్ధమని పేర్కొంది. ఇలా మహారాష్ట్ర రాజకీయాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుముఖత వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మరో రెండు నెలల్లో…..
ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలు కూడా ఈ పరిణామాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. సహజంగా శరద్ పవార్ బయటపడరు. అలాంటిది ఆయన తొలిసారి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే వేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మరి మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరో రెండు నెలల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముంందన్నది విశ్లేషకుల అంచనా.