చిన్నమ్మకు కోపం వచ్చిందట
పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ తన మేనల్లుడు దినకరన్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు తనకు సేవలందిస్తున్న పుహళేందితో శశికళ దినరకర్ పై [more]
పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ తన మేనల్లుడు దినకరన్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు తనకు సేవలందిస్తున్న పుహళేందితో శశికళ దినరకర్ పై [more]
పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ తన మేనల్లుడు దినకరన్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు తనకు సేవలందిస్తున్న పుహళేందితో శశికళ దినరకర్ పై చికాకు పడినట్లు సమాచారం. శశికళ జైలు శిక్ష ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్నారు. వీలయితే అన్నాడీఎంకేను న్యాయపరంగా తమ చేతుల్లోకి తీసుకోవడం, లేకుంటే దినకరన్ పెట్టిన కొత్త పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని విస్తరించడం పైనే ఆమె దృష్టి పెట్టనున్నారు.
మేనల్లుడికి బాధ్యతలు….
నిజానికి తన మేనల్లుడు దినకరన్ పై శశికళకు ఎంతో నమ్మకం ఉండేది. తాను జైలుకు వెళ్లేటప్పుడు కూడా దినకరన్ ను అన్నాడీఎంకే లో కీలక పదవి ఇచ్చి మరీ వెళ్లారు. అయితే ఆ తర్వాత పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలవడంతో దినకరన్, శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించడంతో దినకరన్ పై మరింత నమ్మకం పెరిగింది.
కొత్త పార్టీ పెట్టించినా….
ఎన్నికల కమిషన్ పరంగా తమ చేతికి అన్నాడీఎంకే, రెండాకులు గుర్తు రాదని తెలుసుకున్న శశికళ జైలు నుంచే దినకరన్ చేత కొత్త పార్టీని పెట్టించారంటారు. పార్టీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా శశికళ జైలు నుంచే తన సన్నిహితుల చేత ఇప్పించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలలో గెలవడంతో రానున్న ఎన్నికల్లోనూ తమ పార్టీకి విజయం లభిస్తుందని శశికళ భావించారు. కానీ లోక్ సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో దినకరన్ పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. డీఎంకే దే పై చేయి అయింది.
నేతలందరూ వెళ్లిపోవడంతో…..
అయితే ఎన్నికల్లో ఓటమి పాలయినా పార్టీ నేతలను కాపాడుకోవడంలో దినకరన్ విఫలమయ్యారన్నది శశికళ ఆగ్రహానికి కారణం. తాను జైలు నుంచి వచ్చేంత వరకూ పార్టీ నాయకులను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆదిశిస్తే దినకరన్ ఒంటెత్తు పోకడలు అవలంబించారని పార్టీ నేతలు కొందరు శశికళకు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో పాటు కుటుంబ సభ్యులు కూడా దినకరన్ పై కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో శశికళ మేనల్లుడు దినకరన్ పై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద చిన్నమ్మ తాను వచ్చేసరికి దినకరన్ పార్టీని గాడిలో పెట్టాలని భావించినా ఆమె ఆశలను వమ్ము చేశారు.