స్మాల్ బ్రేక్ అట.. తర్వాత మామూలేనట
శశికళ ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఆమెను దగ్గర నుంచి చూసిన వారెవ్వరూ ఈ నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. అయితే శశికళ చాలా [more]
శశికళ ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఆమెను దగ్గర నుంచి చూసిన వారెవ్వరూ ఈ నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. అయితే శశికళ చాలా [more]
శశికళ ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఆమెను దగ్గర నుంచి చూసిన వారెవ్వరూ ఈ నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. అయితే శశికళ చాలా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. శశికళ గత నాలుగున్నరేళ్లుగా జైలులోనే ఉన్నారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికిప్పుడు అన్నాడీఎంకేను తిరిగి స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదు.
ఇప్పటికిప్పుడు తాను….
అలాగని తాను విడిగా నాలుగో కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలవడమూ కష్టమే. గుప్పిట మూసి ఉంచేంతవరకే.. అన్న సామెత గా తన బలాన్ని అలాగే ఉంచాలని శశికళ భావించినట్లుంది. ఇప్పుడు ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంది. డీఎంకే కు ఈ ఎన్నికలలో గెలిచే హోప్స్ చాలా వరకూ ఉన్నాయి. దీంతో తాను రాజకీయాల నుంచి బయటకు వస్తే అధికారంలోకి వచ్చిన డీఎంకే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగే అవకాశముండదు. తన ఆస్తులను కాపాడుకునే వీలుంటుంది.
భ్రమలు తొలగిపోయి….
దీంతో పాటు పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై క్యాడర్ లోనూ, నాయకుల్లోనూ భ్రమలు తొలగిపోతాయి. దీంతో తిరిగి తనకు అన్నాడీఎంకే బాధ్యతలను వారంతట వారే అప్పగిస్తారు. అప్పుడు జయలలిత వారసురాలిగా ఫ్రెష్ గా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దిగవచ్చు. అప్పటికి తాను పోటీచేసే అవకాశం కూడా వచ్చే వీలుంటుంది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. అందువల్లనే శశికళ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అన్నాడీఎంకే గెలిచినా…?
ఒకవేళ అన్నాడీఎంకే గెలిచినా శశికళకు లాభమే. అన్నాడీఎంకే ఓట్లను చీల్చకుండా శశికళ పార్టీకి లాభం చేకూర్చారన్న సానుభూతి తనకు లభిస్తుంది. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా పదవుల కోసం కొట్లాట తప్పదు. అప్పుడు తన శిబిరంలోకి అన్నాడీఎంకే నేతలు పెద్దయెత్తున తరలి వచ్చే అవకాశముంది. ఇన్ని విధాలుగా లెక్కేసిన శశికళ ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అని భావించారు. ఎన్నికల అనంతరం శశికళ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వనున్నారు.