చిన్నమ్మ వచ్చేస్తుంది.. బీజేపీ వ్యూహమేనా?
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలకు ముందు వేగంగా మారుతున్నాయి. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ఇక్కడ [more]
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలకు ముందు వేగంగా మారుతున్నాయి. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ఇక్కడ [more]
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలకు ముందు వేగంగా మారుతున్నాయి. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ఇక్కడ నామమాత్రమే. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేలు తమిళనాడును శాసిస్తున్నాయి. అయతే వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందన్నది వాస్తవమంటున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడులో శశికళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
బెంగళూరు జైలులో …..
శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పూర్తయింది. గత కొంతకాలంగా శశికళ విడుదలవుతుందన్న ఊహాగానాలు ఉన్నాయి. కర్ణాటక జైలు చట్టం ప్రకారం ముందుగానే విడుదల చేసే అవకాశముందంటున్నారు. అందుకే శశికళ త్వరలోనే విడుదలవుతుందని చెబుతున్నారు.
బీజేపీ నేత ట్వీట్ తో…..
తాజాగా బీజేపీ నేత చేసిన ట్వీట్ తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ నేత ఆశీర్వాదం ఆచారి శశికళ ఆగస్టు నెల 14వ తేదీన విడుదలవుతారని ట్వీట్ చేశారు. శశికళ విడుదల వెనక బీజేపీ ఉందన్న ప్రచారం ఉంది. అయితే శశికళ జైలు శిక్ష సందర్భంగా విధించిన జరిమానా పదికోట్లను ఇంతవరకూ చెల్లించలేదు. అయినప్పటికీ సత్ప్రవర్తన కారణంగా శశికళను విడుదల చేస్తారన్న టాక్ తమిళనాడులో బలంగా ఉంది.
అన్నాడీఎంకేను ఏకం చేసి…..
శశికళ ఆస్తులను కూడా ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను శాఖ జప్తు చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది. ఏడాది ముందు శశికళను బయటకు తెచ్చి అన్నాడీఎంకేను బలోపేతం చేయాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను కూడా ఒప్పంచి అన్నాడీఎంకేను ఒక్కటిగా చేస్తే తమిళనాడులో ఆ పార్టీ కూటమి విజయం సాధించే వీలుందన్న అంచనా ఉంది. అందుకోసమే శశికళను ఏడాది ముందు బయటకు తీసుకువస్తున్నారని చెబుతున్నారు. అయితే శశికళ విడుదల విషయమై కర్ణాటక జైళ్ల శాఖ ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం విశేషం.