సేన ను నమ్ముతారా?
సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, శివసేనలు విడిపోక తప్పదు. తాజాగా భారతీయ జనతా పార్టీని తొలుత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తాము ప్రభుత్వం [more]
సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, శివసేనలు విడిపోక తప్పదు. తాజాగా భారతీయ జనతా పార్టీని తొలుత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తాము ప్రభుత్వం [more]
సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, శివసేనలు విడిపోక తప్పదు. తాజాగా భారతీయ జనతా పార్టీని తొలుత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చి చెప్పింది. దీంతో గవర్నర్ శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది శివసేన ఆలోచన.
ఎన్డీఏతో తెగదెంపులు….
శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు అవసరం. ఈ రెండు మద్దతిస్తేనే శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలగుతుంది. ఇప్పటికే శివసేన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే పేరు ఖరారయింది. ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలన్నది శివసేన నిర్ణయం. అయితే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుంటేనే తాము మద్దతిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని శరద్ పవార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చేందుకు రెడీ అయింది.
కాంగ్రెస్ బయట నుంచి…
కాంగ్రెస్ కు కూడా కావాల్సింది అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండటమే. అందుకే బయట నుంచి మద్దతివ్వనుంది. ఇక శివసేన కూడా ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి రెడీ అయింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలుత శివసేన మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏతో కటీఫ్ చెప్పి కాంగ్రెస్, శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఈ పరిణామాలను ముందే ఊహించింది.
ఎక్కువ కాలం….
అతిపెద్ద పార్టీగా తాము ఆవిర్భవించినా కర్ణాటక తరహాలో అవమానం పాలు కాకూడదని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తగ్గింది. బీజేపీని కాదని శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి నడిస్తే తమకే లాభమని బీజేపీ అంచనా వేస్తుంది. కాంగ్రెస్ తో పొత్తుతో ఎన్నాళ్లో శివసేన అధికారంలో ఉండలేదన్నది బీజేపీ విశ్వాసం. అందుకే తెలివిగా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకే వదలేసిందంటున్నారు. శివసేన గట్టిగా ఆరు నెలలు పాలన చేస్తే గొప్పేనన్నది బీజేపీ నాయకుల నమ్మకం. అందుకే మౌనంగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. మరి శివసేన అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.