సీన్..సీన్ లో సేనకు సితారే
మహారాష్ట్రలో కూటమి ఎంతకాలమో ఉండేటట్లు కనపడటం లేదు. అసలే అరకొర సీట్లతో మూడు పార్టీలూ ఉన్నాయి. దీనికి తోడు వరస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో శివసేన, [more]
మహారాష్ట్రలో కూటమి ఎంతకాలమో ఉండేటట్లు కనపడటం లేదు. అసలే అరకొర సీట్లతో మూడు పార్టీలూ ఉన్నాయి. దీనికి తోడు వరస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో శివసేన, [more]
మహారాష్ట్రలో కూటమి ఎంతకాలమో ఉండేటట్లు కనపడటం లేదు. అసలే అరకొర సీట్లతో మూడు పార్టీలూ ఉన్నాయి. దీనికి తోడు వరస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదిహేను రోజులు కూడా కాలేదు. మంత్రి వర్గ శాఖల కేటాయింపుకే పదిరోజులకు పైగానే పట్టింది. ఇక విస్తరణ ఊసే ఇంతవరకూ కనపడటం లేదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో పాటు ఆరుగురు మాత్రమే ఇప్పటి వరకూ ప్రమాణస్వీకారం చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లు…..
ఇదిలా ఉండగానే పౌరసత్వ బిల్లు సవరణ చట్టం కూడా కూటమి మధ్య ఒకరకంగా చిచ్చురేపిందనే చెప్పాలి. పౌరసత్వ సవరణ చట్ట బిల్లును లోక్ సభలో శివసేన సమర్థించింది. అయితే రాజ్యసభకు వచ్చే సరికి బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో గైర్హాజరయింది. దీనికి సోనియా గాంధీ నుంచి వత్తిడి కారణమని తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని శివసేన తొలి నుంచి సమర్థిస్తుంది. అయితే మహారాష్ట్రలో బీజేపీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సహకారంతోనే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి కాగలిగారు.
సోనియా వత్తిడితో….
రాజ్యసభలో ఓటింగ్ కు వచ్చే సమయంలో సోనియా గాంధీ ఒకింత తీవ్ర స్వరంతోనే శివసేనకు హెచ్చరికలు పంపారట. పౌరసత్వ సవరణ చట్టానికి ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారని తెలుస్తోంది. దీంతోనే శివసేన రాజ్యసభలో గైర్హాజరయిందని చెబుతున్నారు. మహారాష్ట్రలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరాదంటూ కాంగ్రెస్ ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే పై వత్తిడి తెస్తుందని తెలుస్తోంది. ఎన్సీపీ కూడా అదే మాట మీద ఉండటంతో ఉద్ధవ్ థాక్రేకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
రాహుల్ వ్యాఖ్యలతో….
దీనికి తోడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా చిచ్చురేపాయి. రాహుల్ తాను రాహుల్ సావార్కర్ ను కాదని, రాహుల్ గాంధీనని అబద్దాలు చెప్పనని చేసిన వ్యాఖ్యలు కూటమిలో మంటలు రేపాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సావర్కర్ పదం ఉచ్ఛరించే హక్కు రాహుల్ కు లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహల్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేయమని శివసేనను కోరుతోంది. మొత్తం మీద మహారాష్ట్రలో కూటమిలో పదిహేను రోజులకే బీటలు ప్రారంభమయ్యాయి.