సాహసం చేయలేకపోయారా?
ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరతీసింది. సిద్ధరామయ్యను శాసనసభలో ప్రతిపక్ష నేతగా కంటిన్యూ చేయడంపై ఆయన వ్యతిరేకులు మండిపడుతున్నారు. సిద్ధరామయ్యను [more]
ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరతీసింది. సిద్ధరామయ్యను శాసనసభలో ప్రతిపక్ష నేతగా కంటిన్యూ చేయడంపై ఆయన వ్యతిరేకులు మండిపడుతున్నారు. సిద్ధరామయ్యను [more]
ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరతీసింది. సిద్ధరామయ్యను శాసనసభలో ప్రతిపక్ష నేతగా కంటిన్యూ చేయడంపై ఆయన వ్యతిరేకులు మండిపడుతున్నారు. సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తప్పించే సాహసం అధిష్టానం చేయలేకపోయింది. కర్ణాటకలో త్వరలో పదిహేను అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలలో అధిక సీట్లు సాధిస్తే కొద్దోగొప్పో ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేసేందుకు అవకాశముంది. ఈ పరిస్థితుల్లో బలమైన సిద్ధరామయ్యను తప్పించడం మంచిది కాదన్న అభిప్రాయం కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది.
పదవి నుంచి తప్పించాలని….
నిజానికి సిద్ధరామయ్యను ప్రతిపక్ష నేత హోదానుంచి తప్పించాలని జనతాదళ్ ఎస్ కూడా భావిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి కారణమైన సిద్ధరామయ్య ఆపదవి లో ఉండటం జనతాదళ్ ఎస్ కు ఇష్టంలేదు. అందుకే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవానికి కూడా జేడీఎస్ నిరాకరించింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కు సిద్ధరామయ్యపైన జేడీఎస్ ఫిర్యాదు కూడా చేసింది. అందుకోసమే కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను సేకరించింది.
ఉప ఎన్నికల కోసమే….
అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు సిద్ధరామయ్య పక్షానే నిలిచారు. అంతేకాకుండా ఉప ఎన్నికల్లో ఒంటరి పోరు చేయాల్సి రావడం కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు సిద్ధరామయ్య మినహా వేరే ఆప్షన్ లేకుండా పోయింది. సిద్ధరామయ్య కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుంటే ఆయన ఉప ఎన్నికలను లైట్ గా తీసుకుంటారని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయననే కంటిన్యూచేయాలని నిర్ణయించింది. ఇక శాసనసమండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా మాజీ మంత్రి ఎస్ ఆర్ పాటిల్ ను కాంగ్రెస్ హైకమాండ్ డెసిషన్ తీసుకుంది.
అసంతృప్తితో కలవరం…
కానీ సిద్ధరామయ్య కు ప్రతిపక్షనేత హోదా తిరిగి కట్టబెట్టడంపై కాంగ్రెస్ పార్టీలో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పరమేశ్వర్ వర్గం దీనిని సీరియస్ గా తీసుకుంది. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఈప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సిద్ధరామయ్య చేతిలోనే అభ్యర్థుల ఎంపిక కూడా ఉండటంతో కొందరు బాహాటంగానే పార్టీ తీరును తప్పుపడుతున్నారు. మొత్తం మీద ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారని సిద్ధరామయ్యకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెడితే ఇప్పుడు కాంగ్రెస్ లో అసంతృప్తి కలవరపెడుతున్నాయి.