సిద్ధూ సీన్ ను మార్చేస్తున్నారుగా
అదేంటో గాని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇప్పుడు కంటి మీద కునుకులేకుండా పోయింది. రానున్న ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిస్తే తాను తిరిగి ముఖ్యమంత్రి [more]
అదేంటో గాని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇప్పుడు కంటి మీద కునుకులేకుండా పోయింది. రానున్న ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిస్తే తాను తిరిగి ముఖ్యమంత్రి [more]
అదేంటో గాని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇప్పుడు కంటి మీద కునుకులేకుండా పోయింది. రానున్న ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిస్తే తాను తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలన్నది సిద్ధరామయ్య ఆకాంక్ష. అయితే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకున్నా అది సాధ్యమయ్యే అవకాశం లేదనేది వాస్తవం. సిద్ధరామయ్యకు పోటీగా డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో దూసుకుపోతుండటమే ఇందుకు కారణం.
అందరివాడుగా….
సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు నిరంతరాయంగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ లో ఇది సాధ్యమవుతుందని సిద్ధరామయ్య నిరూపించారు. గత ఎన్నికల్లో సయితం సిద్ధరామయ్య బీజేపీకి చుక్కలు చూపించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ 80 స్థానాలను సాధించి తన సత్తా ఏమిటో చెప్పకనే చెప్పారు. అయితే అప్పటి వరకూ అందరివాడుగా ఉన్న సిద్ధరామయ్య సంకీర్ణ సర్కార్ ఏర్పాటుతో కొందరికి దూరమయ్యారు. సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు.
జేడీఎస్ తో కయ్యం…..
ఇక బీజేపీతో విభేదించిన జనతాదళ్ ఎస్ కాంగ్రెస్ తోనే చెలిమిని కంటిన్యూ చేస్తుందనుకున్నారు. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోవడానికి కారణమని భావిస్తూ జేడీఎస్ తప్పుకుంది. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. అయితే దీనికి కూడా సిద్దరామయ్య పెద్దగా బాధపడలేదు. ఇప్పుడు జేడీఎస్ తాము బీజేపీకి మద్దతిచ్చేందుకు కూడా సిద్దమని సంకేతాలు పంపింది. ఇది సిద్ధరామయ్యలో కొంత అలజడికి కారణమయింది.
డీకేకు అప్పగిస్తే…..
మరోవైపు సిద్ధరామయ్యను వ్యతిరేకిస్తున్న జేడీఎస్ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను మాత్రం వెనకేసుకొస్తుంది. డీకే జైలులో ఉండగా స్వయంగా వెళ్లి పలకరించి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ఒకవేళ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకు వచ్చినా జేడీఎస్ మద్దతివ్వాలంటే సిద్ధరామయ్యను తప్పించాలన్న షరతు గ్యారంటీ. ఆయన స్థానంలో డీకే శివకుమార్ కు ఇచ్చినా జేడీఎస్ సహకరింస్తుందన్న ప్రచారం కన్నడనాట జోరుగా సాగుతోంది. దీంతో సిద్ధరామయ్య కు పోటీగా డీకే శివకుమార్ ఎదుగుతారన్నది వాస్తవం. డీకే మనీల్యాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిరావడంతో కాంగ్రెస్ క్యాడర్ లోనూ ఆయనకు సానుభూతి కన్పిస్తుంది. ఇలా సిద్ధరామయ్య వేసుకున్న ఉప ఎన్నికల అంచనాలు తారుమారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.