లాస్ట్ ఛాన్స్ అటగా
సిద్ధరామయ్యకు ఈ ఉప ఎన్నికలు లాస్ట్ ఛాన్స్ గా కన్పిస్తుంది. ఈ ఎన్నికల్లో సిద్ధూ సత్తా చూపించలేకపోతే సిద్ధరామయ్యను పక్కనపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి [more]
సిద్ధరామయ్యకు ఈ ఉప ఎన్నికలు లాస్ట్ ఛాన్స్ గా కన్పిస్తుంది. ఈ ఎన్నికల్లో సిద్ధూ సత్తా చూపించలేకపోతే సిద్ధరామయ్యను పక్కనపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి [more]
సిద్ధరామయ్యకు ఈ ఉప ఎన్నికలు లాస్ట్ ఛాన్స్ గా కన్పిస్తుంది. ఈ ఎన్నికల్లో సిద్ధూ సత్తా చూపించలేకపోతే సిద్ధరామయ్యను పక్కనపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కువ బాధ్యతను మోపింది. ఇటీవల సోనియా గాంధీని కలసిన సిద్ధరామయ్య దాదాపు గంట సేపు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అయితే సోనియా గాంధీతో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జి వేణుగోపాల్ కూడా సిద్ధరామయ్య ఎక్కువ స్థానాలను గెలిపించుకుని రావాలని చెప్పారు.
ఉప ఎన్నికలలో…..
కర్ణాటకలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్యను మించి మరో నాయకుడు లేరన్నది వాస్తవం. ఆయన గెలిపించే సత్తా ఉన్న నాయకుడని హైకమాండ్ కూడా నమ్ముతుంది. ఈ ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకుంటే బీజేపీ సర్కార్ కు ముప్పు తప్పదు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు బాధ్యతలను అప్పగించింది.
సిద్దూపైనే బాధ్యత…..
సిద్ధరామయ్యపై ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి పెరిగిపోయింది. జేడీఎస్ తో విభేదాల కారణంగా ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేయాల్సి వస్తోంది. ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కూడా ఈ ఎన్నికలకు అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో సిద్ధరామయ్య మీద అధిష్టానం పెద్ద బాధ్యతను పెట్టింది. పదిహేను స్థానాల్లో పదమూడు స్థానాలను గెలుచుకురావాలని టార్గెట్ విధించింది. సిద్ధరామయ్య కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసినా గెలిచిన తర్వాత రాజీనామాలు చేయడంపై నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉందని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే అధిక స్థానాలను తాము ఖచ్చితంగా గెలుచుకుంటామని చెబుతోంది.
గెలిస్తే ఓకే….
దీంతోపాటుగా సిద్ధరామయ్య అభ్యర్థుల ఎంపికలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రెడీ చేసింది. అధిష్టానం ఆమోదం కోసం వేచిచూస్తుంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ సిద్ధరామయ్యకు హైకమాండ్ వద్ద పలుకుబడి పెరుగుతుది. అంతేకాదు తిరిగి కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య మాట చెల్లుబాటు అవుతుంది. అందుకే సిద్ధరామయ్య ఈ ఎన్నికలను వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలిస్తే ఓకే లేకుంటే ఈసారి మాత్రం సిద్ధరామయ్యకు సెగ బాగా తగులుతుందని చెప్పకతప్పదు. మరి సిద్ధరామయ్య ఫేట్ ఎలా ఉందో చూడాలి.