అప్పలరాజు తలంటేస్తున్నారే…?
శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నెలల క్రితం వరకూ ఒకే మంత్రి ఉండేవారు. ఆయనే ధర్మాన క్రిష్ణ దాస్. ఆయన మంచితనంతో నెమ్మదిగా ఉంటారని పేరు. దాన్ని మెతకగా [more]
శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నెలల క్రితం వరకూ ఒకే మంత్రి ఉండేవారు. ఆయనే ధర్మాన క్రిష్ణ దాస్. ఆయన మంచితనంతో నెమ్మదిగా ఉంటారని పేరు. దాన్ని మెతకగా [more]
శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నెలల క్రితం వరకూ ఒకే మంత్రి ఉండేవారు. ఆయనే ధర్మాన క్రిష్ణ దాస్. ఆయన మంచితనంతో నెమ్మదిగా ఉంటారని పేరు. దాన్ని మెతకగా కూడా ప్రత్యర్ధులు తీసుకుని రెచ్చిపోతూండేవారు. మాటకు మాట కౌంటర్ ఇవ్వడం ఆయనకు అలవాటు లేని పని. దాంతో జిల్లాలో ఎపుడూ టీడీపీ సౌండే గట్టిగా వినిపిస్తూ వచ్చింది. ఇక కూన రవికుమార్, అచ్చెన్నాయుడు తదితర నాయకులు అయితే పెద్ద నోరు చేసుకుని వైసీపీ మీద ఒక్కసారిగా పడిపోయేవారు. మంత్రిగా అటాక్ చేయమని ఇంచార్జి మంత్రి హోదాలో కొడాలి నాని చెప్పినా కూడా క్రిష్ణ దాస్ తన రూట్ మార్చుకోలేదు.
మొదలు పెట్టి మరీ ….
ఇక ఆ మధ్య ఇద్దరిని జగన్ తన మంత్రివర్గ సహచరులుగా తీసుకుంటే అందులో సిక్కోలుకు చాన్స్ దక్కింది. తొలిసారి గెలిచిన సీదరి అప్పలరాజుకు కోరి మరీ అదృష్టం తలుపు తట్టింది. దాంతో ఆయన మంత్రి అయిపోయారు. ఇక నాటి నుంచి ఆయన దూకుడు మామూలుగా లేదుగా. మాటకు మాట. యాక్షన్ కి రియాక్షన్ ఇలా టీడీపీ పెద్ద గొంతులే వీగిపోయేలా అప్పలరాజు వీర లెవెల్లో ప్రతాపం చూపిస్తున్నారు. ప్రభుత్వం మీద ఒక్క విమర్శ చేస్తే చాలు నాలుగు తిరిగి అంటిస్తున్నారు. దాంతో తమ్ముళ్లకు మంట రేగిపోతోంది.
బాబుకే జవాబు ……
ఇక శ్రీకాకుళం తమ్ముళ్ళే కాదు పెదబాబు చంద్రబాబుకే డైరెక్ట్ గా జవాబు చెప్పేస్తున్నారు. అమరావతి రాజధాని మీద బాబుకు సరైన కౌంటర్లు వేయడంలో అప్పలరాజు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రజా రాజధాని కాని అమరావతి గోల మనకెందుకు బాబూ అంటూ ఆయన వేసిన సెటైర్లు పసుపు పార్టీకి తిక్కరేగేలా ఉన్నాయట. ఇక అచ్చెన్నాయుడు కొత్తగా పార్టీ పదవిలోకి వచ్చారు. ఆయనతో పాటు కూనని సైతం వదలకుండా అయిదేళ్ల కాలంలో మీరు శ్రీకాకుళానికి చేసిందేంటి అంటూ సూటిగా ప్రశ్నించడం ద్వారా అప్పలరాజు అమ్మ బాబోయ్ అనిపించేస్తున్నారు.
సరికి సరి…..
శ్రీకాకుళం రాజకీయాల్లో లోపాయికారి బంధాలకు కొదవలేదు. ఆ పార్టీ ఈ పార్టీ .. వారూ వీరూ తెరచాటున ఒకటి అయిపోతూంటారు. కానీ అప్పలరాజుకు ఈ బంధాలు, ఒప్పందాల కిరికిరి అసలు లేదు. దాంతో ఆయన తమ్ముళ్ళ జాతకాలు అన్నీ బయటపెట్టేస్తున్నారు. ఒక విధంగా వైసీపీ నేతలకు అది జోష్ పెంచేలా ఉంది. ఇంతకాలం టీడీపీ నుంచి పంచ్ డైలాగులే తప్ప గట్టిగా తగులుకునే వైసీపీ నేతలు లేరన్న కొరతను అప్పలరాజు తీర్చేస్తున్నారు. మంత్రిగా కూడా ఆయన తన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి జగన్ ఎందుకు పదవి ఇచ్చాడో ఆ లక్ష్యాన్ని బాగానే నెరవేరుస్తున్నారు అని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు.