అప్పలరాజు అడ్డంగా దొరికిపోయారా… ?
మంత్రి అయి ఏడాది కూడా కాలేదు కానీ దూకుడు విషయంలో శ్రీకాకుళం మంత్రి సీదరి అప్పలరాజు పేరునే అంతా చెప్పుకుంటారు. టీడీపీకి బలమైన ఈ జిల్లాలో అప్పలరాజు [more]
మంత్రి అయి ఏడాది కూడా కాలేదు కానీ దూకుడు విషయంలో శ్రీకాకుళం మంత్రి సీదరి అప్పలరాజు పేరునే అంతా చెప్పుకుంటారు. టీడీపీకి బలమైన ఈ జిల్లాలో అప్పలరాజు [more]
మంత్రి అయి ఏడాది కూడా కాలేదు కానీ దూకుడు విషయంలో శ్రీకాకుళం మంత్రి సీదరి అప్పలరాజు పేరునే అంతా చెప్పుకుంటారు. టీడీపీకి బలమైన ఈ జిల్లాలో అప్పలరాజు గట్టిగానే వారిని సవాల్ చేస్తూ ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. గౌతు ఫ్యామిలీకి పట్టున్న పలాసాతో పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇలాకాలోనూ టీడీపీని ఓడించి లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కించడంతో అప్పలరాజు కీలకమైన పాత్ర పోషించారు. ఆయన మాటల తూటాలు బాగా పేలుస్తారు. అయితే రాజకీయాలకు కొత్త కావడంతో కొన్ని సార్లు దొరికేస్తూ ఉంటారు.
అలా ముందుకు….
ఏపీలో అతి భయంకరమైన కరోనా వైరస్ రకం ఎన్ 440 కె ఉందని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా గట్టిగా ప్రచారం చేశారు. కరోనా తో జనాలు చనిపోతూంటే సర్కార్ పట్టించుకోవడం లేదని కూడా బండలు వేశారు. అయితే ఆయన విపక్ష నేత కాబట్టి అలాగే మాట్లాడుతారు. మరి బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉన్న అప్పలరాజు కూడా ఏపీలో ఎన్ 440 కె వైరస్ ఉందని ప్రచారం చేయడం ఎంతవరకూ సబబు. పైగా దాని వల్ల 15 రెట్లు ఎక్కువగా కరోనా వ్యాప్తి ఉంటుందని కూడా నోరు జారేసి అప్పలరాజు చాలా ముందుకు వెళ్ళిపోయారు. దీంతో ఆయన బాబు బాటలోనే నడిచారని వైసీపీలో చర్చ సాగుతోంది.
కాళ్ళకు బంధం….
చంద్రబాబు మీద యాక్షన్ కి దిగిన వైసీపీకి అప్పలరాజు కాళ్ళకు బంధంగా మారాడని అంటున్నారు. అతి ఉత్సాహంతో ఈ మంత్రి మీడియా ముందు మాట్లాడిన ఈ మాటలే ఇపుడు వైసీపీ పెద్ద వ్యూహానికి పెద్ద దెబ్బ కొట్టేసాయని అంటున్నారు. చంద్రబాబు ని ఏదో విధంగా బుక్ చేయాలని పడిన ఆరాటానికి అప్పలరాజు అడ్డుపడిపోయాడని అంటున్నారు. కరోనా విషయంలో సోషల్ మీడియాతో పాటు చాలా చోట్ల తలో రకంగా ప్రచారం సాగుతోంది. అయితే అవన్నీ వ్యక్తిగతమైనవి. బాధ్యత ఉన్న మంత్రిగా అప్పలరాజు లాంటి వారే జనాలను భయపెడితే ఎలా అంటున్నారు. దాంతో ఆయన మీద కూడా కర్నూల్ లో కేసులు వరసపెట్టి పడిపోయాయి.
కందకు లేని దురద….?
చిత్రమేంటి అంటే వైసీపీలో వైద్య మంత్రి ఎవరూ అంటే ఎవరూ ఠక్కున జవాబు చెప్పలేరు. గోదావరి జిల్లాలకు చెందిన ఆళ్ళ నాని ఈ శాఖను చూస్తున్న సంగతి వారి జిల్లాకే తెలియదు అన్నట్లుగా ఆయన ఉంటారు. కరోనా విషయంలో కానీ దానికి సంబంధించిన చర్యల మీద కానీ మాట్లాడాల్సిన అధారిటీ ఉన్న మంత్రి ఆళ్ళ అయితే ఆయన ఫుల్ సైలెంట్ గా ఉంటారు. మిగిలిన మంత్రులు జోక్యం చేసుకుంటారు. దాంతోనే వస్తోంది తంటా అంటున్నారు. ఇపుడు చంద్రబాబు మీద కేసు పెట్టి వైసీపీ కక్ష సాధింపులకు తెర తీసింది అన్న చెడ్డ పేరు తెచ్చుకుంది. అదే మాటలు అన్న తమ మంత్రి సీదరి అప్పలరాజు మీద కూడా కేసు పెడితేనే ఆ మచ్చ పోతుంది. మరి అన్నెం పున్నెం ఎరగని అప్పలరాజు మీద యాక్షన్ తీసుకుంటారా. ఇంతకాలం బాగా పని చేసి జగన్ వద్ద మంచి మార్కులు తెచ్చుకున్న అప్పలరాజు ఇలా నోరు చేసి బుక్ అయ్యారే అని అనుచరులు బాధపడుతున్నారు.