చౌహాన్ కేబినెట్ లో వారికే అవకాశం?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుర్చీని పదిలం చేసుకున్నారు. నాల్గోసారి ముఖ్యమంత్రిగా పూర్తికాలం ఉండేందుకు ఆయనకు మార్గం సుగమమయింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో [more]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుర్చీని పదిలం చేసుకున్నారు. నాల్గోసారి ముఖ్యమంత్రిగా పూర్తికాలం ఉండేందుకు ఆయనకు మార్గం సుగమమయింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో [more]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుర్చీని పదిలం చేసుకున్నారు. నాల్గోసారి ముఖ్యమంత్రిగా పూర్తికాలం ఉండేందుకు ఆయనకు మార్గం సుగమమయింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారం పదిలమయింది. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో 19 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
నాలుగోసారి సీఎంగా…..
శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో పదమూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండుసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ లో పార్టీని గెలిపించారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో 114 స్థానాలు కాంగ్రెస్ కు దక్కగా, 109 స్థానాలు బీజేపీకి లభించాయి. మూడో సారి కూడా శివరాజ్ సింగ్ గట్టిగానే పోరాడినా అధికారానికి దూరమయ్యారు.
ఉప ఎన్నికల్లో గెలిచి….
ముఖ్యమంత్రి పదవి నుంచి గౌరవంగా తప్పుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. తర్వాత జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులైన 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పటి నుంచి ఈ ఉప ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అన్న టెన్షన్ ఆయన వర్గంలో నిత్యం కనిపిస్తూ ఉండేది.
గెలిచిన ఎమ్మెల్యేలను….
28 నియోజకవర్గాల్లో జ్యోతిరాదిత్య సింధియాతో కలసి ప్రచారం చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ చివరకు 19 స్థానాలను సాధించి తన పదవిని కాపాడుకోగలిగారు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారివల్లనే తాను ముఖ్యమంత్రి కావడంతో సింధియాతో చర్చలు జరిపి త్వరలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణ చేపడతారంటున్నారు.