ఫైర్ బ్రాండ్ ఇరానితో సోనియా హైరానా
ఎక్కడ ఎటువంటి అస్త్రాన్ని ప్రయోగించాలో భారతీయ జనతాపార్టీకి బాగా తెలుసు. అందుకే ఎంతటి ప్రత్యర్థులపైన అయినా విజయం సాధిస్తోంది. ఎటువంటి పట్టు లేని ప్రాంతాల్లో సైతం దూసుకుపోతోంది. [more]
ఎక్కడ ఎటువంటి అస్త్రాన్ని ప్రయోగించాలో భారతీయ జనతాపార్టీకి బాగా తెలుసు. అందుకే ఎంతటి ప్రత్యర్థులపైన అయినా విజయం సాధిస్తోంది. ఎటువంటి పట్టు లేని ప్రాంతాల్లో సైతం దూసుకుపోతోంది. [more]
ఎక్కడ ఎటువంటి అస్త్రాన్ని ప్రయోగించాలో భారతీయ జనతాపార్టీకి బాగా తెలుసు. అందుకే ఎంతటి ప్రత్యర్థులపైన అయినా విజయం సాధిస్తోంది. ఎటువంటి పట్టు లేని ప్రాంతాల్లో సైతం దూసుకుపోతోంది. ఈశాన్య రాష్ట్రాలు మొదలు దక్షిణ బారతం వరకూ విస్తరించింది. ఉత్తరప్రదేశ్ ను వడిసిపట్టేసింది. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెసు కుటుంబానికి ఆయువుపట్టుగా ఉన్న రెండు నియోజకవర్గాలు అమేధీ, రాయ్ బరేలీ. గత ఎన్నికల్లో అమేథీని ఢీకొట్టి రాహుల్ ను పడగొట్టేసింది. తాజాగా రాయ్ బరేలీలో సోనియాకు చెక్ పెట్టే ‘దిశ’లో పావులు కదుపుతోంది. ఎంతటి సవాల్ నైనా నవ్వుతూ స్వీకరించే ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని సోనియాపై ప్రయోగిస్తోంది. అమేథీలో రాహుల్ ను ఓడించింది. సోనియాపై కూడా స్మృతి ఇరానీనే పోటీకి దింపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. స్మృతికి పెద్దగా సంబంధం లేని రాయ్ బరేలీలో జిల్లా అభివృద్ధి సహకార సమన్వయ సంఘం (దిశ) కు ఛైర్ పర్సన్ గా స్మృతి ఇరానీని ప్రభుత్వం నియమించింది. సాధారణంగా స్థానిక ఎంపీని ఈ కమిటీకి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. దానిని తోసిరాజంటూ కేంద్రమంత్రికి బాధ్యత ఇవ్వడంలోనే పార్టీ ఎత్తుగడ అర్థమవుతోంది. దాంతో సరిపెట్టలేదు. సోనియాను ఆమెకు సహ అద్యక్షురాలిగా ఉత్తర్వులిచ్చారు. ఇది కచ్చితంగా కాంగ్రెసు అగ్రనాయకురాలిని అవమానించడమే.
వీళ్లేమో రాజవంశం…
కాంగ్రెసు పార్టీ ఉత్తరప్రదేశ్ లో నామ్ కే వాస్తేగా మారిపోయి చాలా కాలమైంది. అయినా అమేథీ , రాయబరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనాయకులు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2014 వరకూ మిగిలిన పార్టీలు కూడా ఆ స్థానాలవైపు వెళ్లలేదు. అక్కడ అనవసరంగా ఖర్చు పెట్టడం, సమయం వృథా చేసుకోవడం అనవసరమని బీఎస్పీ, ఎస్పీ వంటి పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. గాంధీ కుటుంబం ఆ ప్రాంతంపై అంతగా పట్టు సాధించింది. తొలిసారిగా స్మృతి ఇరానీని బీజేపీ రాహుల్ గాంధీపై బరిలోకి దింపింది. అప్రతిహతంగా విజయం సాధిస్తాడనుకున్న రాహుల్ కు స్మృతి ఇరానీ చుక్కలు చూపించింది. సామాన్యుల్లో ఒకరిగా కలిసి పోయి, నియోజకవర్గమంతా కలియతిరిగింది. నియోజకవర్గం తనకు కొత్త అయినా కలివిడితనంతో ప్రజల్ని ఆకట్టుకుంది. ఇలాంటి ప్రతినిధి తమకు కావాలి కదా, అనిపించేలా చేసుకుంది. గాందీ కుటుంబం చూస్తే నియోజకవర్గం లో గెలవడం మినహా పెద్దగా నియోజకవర్గం మొహం చూడరు. అయినా వారిని ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. స్మృతి ఇరానీ దెబ్బను కాచుకుంటూ చచ్చీచెడి రాహుల్ 2014లో గట్టెక్కారు. మళ్లీ 2019లో ఇరానీ పోటీ చేయడంతో అదృష్టం తారుమారైంది. తాను నెగ్గకపోయినా అయిదేళ్లూ ఆ నియోజకవర్గంతో టచ్ లో ఉన్నారు స్మృతి. ఓడిపోయాక పలుసార్లు పర్యటించారు. ఇదంతా ఆమెకు కలిసి వచ్చింది. యువరాజునే ఓడించి ఆమెకు పట్టం గట్టారు అమేధీ ప్రజలు. సామాన్య ఓటర్లు స్మృతిని తమతో ఐడెంటిఫై చేసుకోవడమే ఈ విజయానికి కారణం.
ఆమెకు అదో సాహసం…
అమేథీలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన స్మృతి ఇరానీకి గెలుపోటములతో నిమిత్తం లేదనే చెప్పాలి. పనిచేసుకుంటూ పోతుంటారామె. అదే ఆమె సక్సెస్ కు కారణం. రిస్క్ తీసుకోవడానికి ముందుంటారు. ఎదురుదెబ్బలు ఎన్ని తిన్నా మళ్లీ పడిలేచిన కెరటంలా పోరాడుతుంటారు. ముక్కుసూటిగా , స్పష్టంగా వ్యవహరించే ఆమెకు బీజేపీలో చాలా ఆకర్షణ ఉంది. నిజానికి మోడీ, అమిత్ షా లకు ఆమె పట్ల పెద్దగా సదభిప్రాయం లేదు. కానీ పార్టీలో ఉన్న క్రేజ్. కష్టించే తత్వం స్మృతి ఇరానీకి అవకాశాలు కల్పిస్తున్నాయి. పంతం, పట్టుదల, మొండితనం , ఓటమికి వెరవని తత్వం కారణంగానే సోనియా నియోజకవర్గమైన రాయ్ బరేలీకి ఆమెను పంపించారు. అక్క్డడ పాగా వేయాలనుకుంటున్నారు. రాయ్ బరేలీ ‘దిశ’ఛైర్ పర్సన్ గా ఇరానీ ఎటువంటి ముద్ర వేస్తారనే దానిపైనే నియోజకవర్గ ప్రజల ఆదరణ ఆధారపడి ఉంటుంది. సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వంటి పార్టీలు చేయని సాహసానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. కానీ స్థానిక ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవ స్థానాన్ని మాత్రం రాజకీయ కారణాలతో కబ్జా చేసింది.
ప్రియాంకకు సవాల్…
అమేధీ, రాయ్ బరేలీ లకు రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పట్నుంచి ఆ నియోజకవర్గాల బాగోగులను ప్రియాంక చూసుకుంటున్నారు. రాహుల్, సోనియా 1998 నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు. వారికి ప్రతినిధిగా ఈ నియోజకవర్గాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ఎన్నికల నిర్వహణ, కార్యకర్తలతో సంబంధాలు, ప్రచారం వంటి వాటికి ప్రియాంక అనుసంధాన కర్తగా ఉంటుండేవారు. సోనియా తర్వాత రాయ్ బరేలీకి ప్రియాంక ను బరిలో దింపుతారని కాంగ్రెసు వర్గాలు సైతం భావిస్తున్నాయి. 2024లోనే సోనియా ఆరోగ్యకారణాలతో పోటీ నుంచి విరమించుకుని ప్రియాంకకు అవకాశం ఇవ్వవచ్చనే వాదన ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వారసత్వానికి చెక్ పెట్టాలనే దిశలో బీజేపీ స్మృతి ఇరానీని రంగంలోకి దింపింది. కాంగ్రెసు పార్టీకే కాదు, ప్రియాంకకు కూడా ఇదొక పెద్ద సవాల్. ఒకవేళ సోనియా పోటీ చేసినా ఎన్నికల బాధ్యతలను చూడాల్సింది ప్రియాంకనే. అందువల్ల ముగ్గురు మహిళల మధ్య రాజకీయ పోరులో నియోజకవర్గం మొగ్గు ఎటు ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ గట్టిగా పోటీ నివ్వాలనే ఉద్దేశంతోనే లోక్ సభ ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే బీజేపీ సిద్దమవుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్