ఎందుకీ సేవ..? ఎవరిని చంపడానికి?
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ఖాళీగా ఇంట్లో కూర్చోరు దాతలు. మేమున్నాం అంటూ ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నా దూకేస్తారు. అవి తుఫాన్ లు అయినా, [more]
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ఖాళీగా ఇంట్లో కూర్చోరు దాతలు. మేమున్నాం అంటూ ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నా దూకేస్తారు. అవి తుఫాన్ లు అయినా, [more]
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ఖాళీగా ఇంట్లో కూర్చోరు దాతలు. మేమున్నాం అంటూ ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నా దూకేస్తారు. అవి తుఫాన్ లు అయినా, వరదలు అయినా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ప్రభుత్వాలతో పోటీ పడి పేదలను ఆదుకోవడానికి ఆపన్న హస్తం అందించడం మన సంస్కృతి, సంప్రదాయంలో ఒక భాగంగా మారిపోయింది. కరోనా వస్తే అమెరికాలో లూటీలు జరుగుతాయి అదే మన దగ్గర దానాలు పెరుగుతాయి అని తమ సేవాకార్యక్రమాల ద్వారా చాటిచెబుతున్నారు చాలా మంది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య విభాగం వారికి అండగా నిలుస్తున్నారు.
పాటించని నిబంధనలు …
ప్రస్తుతం ఎపి, తెలంగాణాలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు నింగిని అంటుతున్నాయి. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అవసరమైనవి అందించడంలో దూసుకుపోతున్న సామాజిక సేవ చేసేవారు కరోనా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వం, వైద్య నిపుణల హెచ్చరికలు పక్కన పెట్టేస్తున్నారు. చాలా సేవాకార్యక్రమాల్లో భారీ సమూహాలుగా కొలువు తీరడం సభలు, సమావేశాలు నిర్వహించడం పలువురిలో ఆందోళన పెంచుతుంది. సామాజిక దూరం పాటించాలని తమ ప్రసార మాధ్యమాల ద్వారా పదేపదే చాటిచెప్పే మీడియా వారు సైతం ఈ నిబంధనలకు విలువ నివ్వడం లేదు. అలాగే రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే సేవాయ కార్యక్రమాల్లో కూడా సామాజిక దూరం పాటించడం లేదని మీడియా లో ప్రసారం అవుతున్న వీడియో లు చెప్పక చెబుతున్నాయి.
వైరస్ కట్టడి కి అదే బ్రహ్మాస్త్రం …
ఒక పక్క ప్రధాని, ముఖ్యమంత్రులు వంటివారు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ విధులను నిర్వహిస్తున్న అంశాలు చూస్తున్నా మాకేమి కాదన్న నిర్లక్ష్యం సమాజానికి ఇప్పుడు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది. ఈ తరహా నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళకు కూరగాయల కొనుగోళ్ళు, మాంసం దుకాణాల దగ్గరా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం దీని కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నా ప్రజల్లో లేకపోవడమే ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా అంతా తమ చుట్టూనే కంటికి కనిపించని శత్రువు దాడికి సిద్ధంగా ఉన్నాడని తక్షణమే గ్రహించి నిబంధనలు పాటించడమే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.