సోము సాధించారు … అద్భుతాలు జరగాల్సిందేనా?
సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలరని బిజెపి ఎపి అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు ఉదంతం మరోసారి నిరూపించింది. దాదాపు 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో [more]
సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలరని బిజెపి ఎపి అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు ఉదంతం మరోసారి నిరూపించింది. దాదాపు 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో [more]
సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలరని బిజెపి ఎపి అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు ఉదంతం మరోసారి నిరూపించింది. దాదాపు 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో అత్యంత కీలకమైన తరుణంలో పార్టీ పగ్గాలను ఎపి లో సోము చేపట్టారు. ఇన్ని మెట్లు ఎక్కడానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఎన్నో అవమానాలు ఛీత్కారాలు, ఒక దశలో పార్టీని సోము వీర్రాజు వీడిపోతారా అన్న ప్రశ్నలు ప్రచారాలు సాగినా సహనంతోనే అన్ని అధిగమించి అనుకున్న స్థాయికి సోము వీర్రాజు చేరుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరుణం గతంలో బిజెపి ఎన్నడు ఎదుర్కొని సంక్లిష్ట సమయం అనే చెప్పాలి.
ముళ్లకిరీటమే …
సోము వీర్రాజు కు పగ్గాలు అందించిన సమయానికి బిజెపి లో ఉన్న గందరగోళం ఏ పార్టీలోనూ లేదు. నేత ల నడుమ సమన్వయం అనే మాటకు అర్ధం లేదు. ఏ నాయకుడు ఏ రోజు ఏ ప్రకటన చేసి గందరగోళం తెచ్చిపెడతారో ఎవరికి తెలియదు. ఎవరు టిడిపి కి అనుకూలురో, ఎవరు వైసిపి కి అనుకూలురో అందరికి తెలిసినా పార్టీలో క్రమశిక్షణ గీతాలు కాదు ఎల్లలు దాటేసింది. అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఆరెస్సెస్ అండదండలు ఉన్న కమలం ఎపి లో వికసించడం సంగతి ఎలా ఉన్నా పూర్తిగా మాడిపోయే వుంది. ఆ దశలో పగ్గాలు అందుకున్న సోము వీర్రాజు వచ్చి రావడంతోనే ఎపి లో కమలంలో ఒక్కసారిగా జోష్ నెలకొంది. ఆయనకూడా పార్టీ శ్రేణుల అంచనాలకు అనుగుణంగానే కత్తి తీసి పార్టీ లైన్ దాటిన వారిపై వేటు మొదలు పెట్టేశారు. సంక్లిష్టమైన మూడు రాజధానుల అంశంపైనా తమ పార్టీ విధానం ఇది అని ప్రకటించినా ఆ సమస్య పై గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా మరిన్ని సమస్యలు కమలాన్ని చుట్టుముడుతూ కనిపిస్తున్నాయి.
సోము లెక్కలు నిజమేనా … ?
ఎపి లో దాదాపు జీరో లో ఉంది బిజెపి దాన్ని 25 శాతం ఓటు బ్యాంక్ గా మార్చడమే తన లక్ష్యమని నూతన కమల దళపతి సోము వీర్రాజు చెప్పుకొస్తున్నారు. అది ఎలా అంటే ఆయన చెబుతున్న లెక్కలు చర్చనీయంగా మారాయి. 1998 లో వాజ్ పేయి నాయకత్వంలో ఉమ్మడి ఎపి లో 18 శాతం ఓట్లు నాలుగు పార్లమెంట్ సీట్లు వచ్చిన సంగతి గుర్తు చేస్తున్నారు సోము. ప్రజారాజ్యం పార్టీకి సుమారుగా అంత శాతం ఓట్లు వచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. అంటే ఎపి లో రెండు ప్రధాన పార్టీలను కాదనేవారు 18 శాతం ఎప్పుడు ఉంటారని బిజెపి బలంగా ఉంటే ఆ ఓట్లు తమ పార్టీకే పడతాయన్నది సోము వీర్రాజు అంచనా. దీనికి గత ఎన్నికల్లో జనసేన కు వచ్చిన 7 శాతం ఓట్లను కూడా కలిపేసి 25 శాతం ప్రజలు రెండు కుటుంబ పార్టీలకు చెక్ పెట్టేస్తారన్న ధీమా వీర్రాజు వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి ని జీరో చేస్తేనే …
అయితే ఈ లెక్కలను అటు వైసిపి టిడిపి కూడా కొట్టిపారేస్తున్నాయి. సోము వీర్రాజు చెప్పిందే నిజమని భావించినా ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపిన వారిలోనే జనసేనకు మొన్న ఎన్నికల్లో ఓట్లు వేశారని అలా చూసుకుంటే 18 నుంచి 7 శాతానికి వారి సంఖ్య పడిపోయిందంటున్నారు. ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు కాకి లెక్కలు వేస్తాయని అయితే అంతిమంగా ప్రజల మూడ్ ని బట్టే ఓటింగ్ ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు రాబోయే నాలుగు సంవత్సరాల్లో తాను అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఎపి లో అద్భుతాలు జరగాలి లేదా ప్రధాన ప్రతిపక్షం అంతరించి పోవాలి. మరి దీనికి కమలం దగ్గర ఎలాంటి వ్యూహం ఉందొ చూడాలి.