కోటరీయే సోమును ఆడిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదల లేదు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటున్నా ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది. పార్టీ అధ్యక్షుడిని [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదల లేదు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటున్నా ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది. పార్టీ అధ్యక్షుడిని [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదల లేదు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటున్నా ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది. పార్టీ అధ్యక్షుడిని మార్చినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టి ఇప్పుడు ఆరునెలలకు పైగానే సమయం పట్టింది. ఆయన పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత పార్టీ పెద్దగా పుంజు కోలే దంటున్నారు.
టీడీపీ కారణంగానే…..
సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తొలి నుంచి బీజేపీ రాష్ట్రంలో ఎదగకపోవడానికి టీడీపీయే కారణమని భావిస్తున్నారు. అనేక సార్లు బహిరంగంగానే ఆయన ఈ ఆరోపణలు చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు వల్లనే బీజేపీ రాష్ట్రంలో ఎదగ లేకపోయిందని, అందుకే తాము ఇక టీడీపీని దరిచేర్చేది లేదని చెబుతున్నారు. టీడీపీ గత ఎన్నికలకు ముందు తెగదెంపులు చేసుకోవడం తమకు మంచిదే అయిందంటున్నారు.
వారిని దూరంగా…..
కానీ సోము వీర్రాజు కు ఇప్పటికీ టీడీపీ ఫీవర్ ఉందంటున్నారు. ఆయన పార్టీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులను పూర్తిగా పక్కన పెట్టేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నేతలను అసలు పట్టించుకోవడం లేదు. వారికి పార్టీ కార్యక్రమాల సమాచారం నామమాత్రంగానే అందిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ వీరి సేవలను ఉపయోగించుకోకూడదని సోము వీర్రాజు నిర్ణయించుకున్నారు.
అందుకే చేరికలు లేక…..
ఆయన తనకంటూ ప్రత్యేకమైన గ్రూపును బీజేపీలో రూపొందించుకున్నారు. ప్రధాన బాధ్యతలన్నీ సోము వీర్రాజు వారికే అప్పగిస్తున్నారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు ఒక కోటరీ కే పరిమితమయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం టీడీపీ యే బీజేపీ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారిందంటున్నారు. సోము వీర్రాజు వ్యవహారశైలితోనే గత కొన్ని నెలలుగా పార్టీలో చేరికలు లేవంటున్నారు.