సోము పై వేటు పడక తప్పదా?
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టి దాదాపు ఏడాది కావస్తుంది. అయితే ఏ అధ్యక్షుడికి ఎదురుకాని సవాళ్లు సోము వీర్రాజుకు ఎదురయ్యాయి. పార్టీ [more]
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టి దాదాపు ఏడాది కావస్తుంది. అయితే ఏ అధ్యక్షుడికి ఎదురుకాని సవాళ్లు సోము వీర్రాజుకు ఎదురయ్యాయి. పార్టీ [more]
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టి దాదాపు ఏడాది కావస్తుంది. అయితే ఏ అధ్యక్షుడికి ఎదురుకాని సవాళ్లు సోము వీర్రాజుకు ఎదురయ్యాయి. పార్టీ అధ్యక్షుడంటే కనీస స్థాయి పనితీరు కనపర్చాలి. అది ఎన్నికల్లోనే కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బలమైన నేతలున్న చోట్ల అక్కడక్కడ బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో….
స్థానిక సంస్థల ఎన్నికలను అటు ఉంచితే త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకమే. పార్లమెంటు ఎన్నిక కావడంతో అక్కడ బీజేపీ, జనసేనల నుంచి ఎవరు పోటీ చేసినా కనీస ఓట్లను సాధించాలి. ఇప్పటికే తామే వైసీపీకి ప్రత్యామ్నాయం అంటూ సోము వీర్రాజు చెప్పుకుని తిరుగుతున్నారు. తాము ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా మారడమే ముందున్న లక్ష్యమంటున్నారు. కానీ టీడీపీ ని వెనక్కు నెట్టి ముందుకు వచ్చే పరిస్థితి ఏపీలో ఇప్పుడు లేనట్లే కన్పిస్తుంది.
కేంద్రం నిర్ణయాలు….
దీనికితోడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సోము వీర్రాజుకు తలనొప్పిగా మారాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పాపమంతా ఆయనే మోయాల్సి వస్తుంది. అందుకే ఇటీవల సోము వీర్రాజు అమరావతి రాజధాని అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడేళ్లలో అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని పక్కకు నెట్టేయడానికే సోము వీర్రాజు అమరావతిని ముందుకు తెచ్చారంటున్నారు.
మరో ఏడాది తర్వాత…..
దీంతో రెండేళ్ల తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు దిగిపోక తప్పదని పార్టీ నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి. రెండేళ్ల తర్వాత బీజేపీ అధ్యక్షులను మార్చే సంప్రదాయం ఉంది. సోము వీర్రాజుకు తొలి ఏడాదిలోనే అవమానకర రీతిలో ఫలితాలు కన్పించాయి. పార్టీలోనూ ఒకవర్గానికి సోము వీర్రాజు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీకి సోము వీర్రాజు స్థానంలో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.