సోనియా మళ్లీ యాక్టివ్ అయ్యారట
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తిరిగి యాక్టివ్ అయినట్లే కన్పిస్తుంది. అనారోగ్య కారణాలతో గత కొద్దిరోజులుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోనియా గాంధీ ఇటీవల తిరిగి [more]
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తిరిగి యాక్టివ్ అయినట్లే కన్పిస్తుంది. అనారోగ్య కారణాలతో గత కొద్దిరోజులుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోనియా గాంధీ ఇటీవల తిరిగి [more]
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తిరిగి యాక్టివ్ అయినట్లే కన్పిస్తుంది. అనారోగ్య కారణాలతో గత కొద్దిరోజులుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోనియా గాంధీ ఇటీవల తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారు. 2019 నుంచి సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.
అన్నింటికి దూరంగా….
ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ దూరంగా ఉంటూ వస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉన్నప్పటికీ ఆమె ఆరోగ్య కారణాల రీత్యా హాజరుకాలేదు. 2018 ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అన్ని ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ దూరంగా ఉంటూ వస్తున్నారు.
మరోసారి రాహుల్ ను…
కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఇంకా మీమాంస అలాగే ఉంది. రాహుల్ గాంధీని నియమించాలని వత్తిడి పెరుగుతూ ఉంది. మరోవైపు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు పూర్తికాలపు అధ్యక్షుడిని నియమించాలంటూ అనేకమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే ఏఐసీసీ సమావేశాన్ని నిర్వహించి మరోసారి రాహుల్ గాంధీకి బాధ్యతలను అప్పగించాలన్నది సోనియా గాంధీ ఆలోచనగా ఉంది.
పార్టీ సమావేశాల్లో…
ఇటీవల సోనియా గాంధీ తిరిగి యాక్టివ్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో పాటు సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారు. కరోనా కట్టడి విషయంలో మోదీ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని దుయ్యబట్టారు. తిరిగి సోనియా గాంధీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో నేతల్లోనూ జోష్ నెలకొంది. కరోనా కారణంగా వయసురీత్యా ఆమె బయటకు రాకపోయినా వర్చువల్ సమావేశాల ద్వారా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.