అభాసుపాలవుతామా?
మహారాష్ట్ర రాజకీయం అనిశ్చితికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. దీనికి కారణం పెద్దాయన శరద్ పవార్. శరద్ పవార్ చేతిలోనే ప్రభుత్వ ఏర్పాటు ముడిపడి ఉంది. శరద్ [more]
మహారాష్ట్ర రాజకీయం అనిశ్చితికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. దీనికి కారణం పెద్దాయన శరద్ పవార్. శరద్ పవార్ చేతిలోనే ప్రభుత్వ ఏర్పాటు ముడిపడి ఉంది. శరద్ [more]
మహారాష్ట్ర రాజకీయం అనిశ్చితికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. దీనికి కారణం పెద్దాయన శరద్ పవార్. శరద్ పవార్ చేతిలోనే ప్రభుత్వ ఏర్పాటు ముడిపడి ఉంది. శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయి చర్చించారు. కామన్ మినిమం ప్రోగ్రాంతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ లు ప్రభుత్వంలో చేరడంపై కూడా చర్చించినట్లు తెలిసింది. అయితే తాము హడావిడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా కర్ణాటక తరహాలో కాకూడదని సోనియా గాంధీ నమ్ముతున్నారు.
కర్ణాటక తరహాలో….
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసినా పథ్నాలుగు నెలలు మాత్రమే మనగలిగింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన అసంతృప్తి ఇందుకు కారణమని సోనియా గాంధీ గట్టిగా నమ్ముతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యవహార శైలి గిట్టకనేనని బహిరంగా చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని కుమారస్వామి పాటించకపోవడమే అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ ఇప్పటికీ విశ్వసిస్తుంది.
ముఖ్యమంత్రి ఎవరైనా….
కర్ణాటక తరహా ఘటన మహారాష్ట్రలో పునరావృతం కాకూడదని సోనియా గాంధీ భావిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటయితే శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. అయితే శివసేన ముఖ్యమంత్రి అందరు ఎమ్మెల్యేలను కలుపుకుని పోయేలా ఉండాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. వారి నియోజకవర్గాల బాగోగులను పట్టించుకోవడమే కాకుండా, వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలని సోనియా గాంధీ గట్టిగా భావిస్తున్నారు.
అసంతృప్తి తలెత్తకుండా….
శరద్ పవార్ తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయంపై ఇద్దరూ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినా బీజేపీకి అవకాశమివ్వకూడదని, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి మంత్రులుగా ఎంపికయ్యే వారు సయితం అందరినీ సమన్వయం చేసుకునిపోయేలా ఉండాలని సోనియాగాంధీ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఏ పార్టీలో అసంతృప్తి తలెత్తినా బీజేపీకి అడ్వాంటేజీగా మారడమే కాకుండా మళ్లీ అభాసుపాలవుతామని సోనియా గాంధీ ఆచితూచి మహారాష్ట్ర రాజకీయాలపై నిర్ణయం తీసుకోవాలని శరద్ పవార్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లు అధికారంలో ఉండేలా ముందుగానే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.