న్యూటీమ్ వచ్చేస్తుందటగా
సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇక సోనియా గాంధీ రాష్ట్రాల పార్టీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టనున్నారన్న [more]
సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇక సోనియా గాంధీ రాష్ట్రాల పార్టీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టనున్నారన్న [more]
సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇక సోనియా గాంధీ రాష్ట్రాల పార్టీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అందులో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉంది. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో పార్టీ బలపడాల్సి ఉన్నప్పటికీ నేతల కారణంగానే భ్రష్టుపట్టిపోయిందన్న ఒక నిర్ధారణకు వచ్చారు సోనియా. దీంతో తెలంగాణలో టీమ్ మొత్తాన్ని మార్చేయాలన్న నిర్ణయంతో ఉన్నారని సమాచారం.
రెండుసార్లు మిస్సయి….
దశాబ్దాల డిమాండ్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ రెండు సార్లు అధికారంలోకి రాలేకపోయింది. దీనికి ప్రధాన కారణం నేతల వైఫల్యమే. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు దఫాలుగా కంటిన్యూ అవుతున్నారు. మరోసారి ఉండాలని ఆయన ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సందర్భంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాహుల్ కు సంఘీభావంగా రాజీనామా చేసినా ఉత్తమ్ మాత్రం రాజీనామా చేయలేదు.
లాబీయింగ్ తో….
పైగా ఢిల్లీలో పదవి కోసం లాబీయింగ్ చేయడం కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెెడ్డి ఇప్పటికే ఎంపీగా ఎన్నిక కావడంతో ఆయనను తప్పించి కొత్తవారిని నియమించాలన్న నిర్ణయానికి సోనియా వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పీసీీసీ మొత్తాన్ని తొలగించి న్యూటీమ్ ను నియమించాలన్న యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
రేసులో అనేక మంది…..
పీసీసీ అధ్యక్ష పదవిని అందుకునేందుకు అనేకమంది సీనయర్ నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో మల్లు భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పేర్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. బీసీలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎక్కువగానే వినపడుతుంది. రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే సీనియర్ నేతలు సహకిరించరన్న భయం కూడా ఉంది. దీంతో పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉత్తమ్ పదవి మాత్రం ఊడటం ఖాయంగా కన్పిస్తుంది.