దమ్మున్నోడంటే ఈయనే కదా?
కరోనా….ఈ ముాడక్షరాల మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీనిని అధిగమించే మార్గం తెలియక ఆందోళన చెందుతోంది. అభివృధ్ది చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు సైతం దీనిని నియంత్రించే మార్గం [more]
కరోనా….ఈ ముాడక్షరాల మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీనిని అధిగమించే మార్గం తెలియక ఆందోళన చెందుతోంది. అభివృధ్ది చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు సైతం దీనిని నియంత్రించే మార్గం [more]
కరోనా….ఈ ముాడక్షరాల మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీనిని అధిగమించే మార్గం తెలియక ఆందోళన చెందుతోంది. అభివృధ్ది చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు సైతం దీనిని నియంత్రించే మార్గం తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచదేశాలన్నీ దీనికి ముకుతాడు వేసే పనిలో ఉన్నాయి. అన్నీ పనులనుా పక్కనపెట్టాయి. ఈ ఏడాది నవంబరులో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల నిర్వహణపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. గతనెలలో జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ స్ధానిక సంస్ధల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికలసంఘం వాయిదా వేసింది. ఇతర రాష్ట్రాలుా ఇదేబాటలో నడిచాయి. కొన్ని దేశాలు కుాడా ఇదే బాటలో ఉన్నాయి.
ఎన్నికలను నిర్వహించి…..
ఇంతటి విపత్కర పరిస్ధితుల్లోనుా షెడ్యుాల్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళన ఏకైక దేశం దక్షిణకొరియా. కరోనాను కుాడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళంది. దీనిని ఓ పక్కన విజయవంతంగా కట్టడి చేస్తూనే, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా ఎన్నిలను నిర్వహించింది ఈ తుార్పు ఆసియా దేశం. ఈనెల 15న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార పార్టీ ఘనవిజయం సాధించింది. మెుత్తం 300 స్ధానాలకు అధికార డెమొక్రటిక్ పార్టీ 180 స్ధానాలను గెలుచుకుని సంపూర్ణ ఆధిక్యం సాధించింది. మిత్రపక్షమైన శాటిలైట్ పార్టీలో ముందుకెళ్ళి ఘనవిజయాన్ని అందుకుంది. 71.9 శాతం పోలింగ్ నమెాదైంది. 1992 తర్వాత అధిక శాతం పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో 66.2 శాతం పోలింగ్ నమెాదైంది.
పదమూడేళ్ల తర్వాత…..
నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జె ఇన్ గత ఎన్నికల్లో కన్నా 60 స్ధానాలు అధికంగా సాధించడం విశేషం. 1987 తర్వాత పార్టీ ఇంతటి ఘన విజయం సాధించిడం ఇదే ప్రధమం. దాదాపు నాలుగున్నర కోట్లమంది ప్రజలు ఈఎ న్నికల్లో తము ఓటు హక్కును వినియెాగించుకున్నారు. మళ్ళీ మున్ కు పట్టంగట్టారు. అధికార డెమెుక్రటిక్ పార్టీ అనుసరించిన దేశీయ, విదేశాంగ విధానాలు, శత్రుదేశమైన ఉత్తర కొరియాతో సత్వర సంబంధాలకు ప్రయత్నించడం, ప్రజారోగ్య విధానాలు మళ్ళీ దానికి అధికారాన్ని కట్టబెట్టాయి. ఈ ఎన్నికల్లో విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని పార్టీ వ్యాఖ్యానించింది. విపక్ష కన్సర్వేటివ్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చుారగొనడంలో విఫలమైంది. రాజధాని సియోల్ నగరంలోనుా సరైన పనితీరును కనబరచలేకపోయింది.
కరోనా ను కట్టడి చేస్తూనే…..
ఒక పక్క కరోనాను కట్టడి చేస్తుానే ఎన్నికలకు వెళ్ళింది ప్రభుత్వం. పోలింగ్ సమయంలో ఓటర్లు భౌతిక దుారం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంది. వారికి మాస్కులు, గ్లౌజులు సరఫరాచేసింది. క్వారంటైన్ లో ఉన్న ప్రజలు సాధారణ ఓటర్లతో కాకుండా ఓటు హక్కు వినియెాగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందరుా కలసినట్లయితే అంటువ్యాధి ప్రబలుతుందన్న ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికలకు ముందే కరోనాపై యుద్ధం ప్రకటించింది. గతంలో సార్స్, మెర్స్ లను నియంత్రించిన అనుభవం ఈ దేశానికి ఉంది. దేశంలో ప్రెవేట్ ఆసుపత్రుల ప్రాబల్యం ఎక్కువే. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని 97 శాతం ప్రజలకు నిర్బంధ, జాతీయ ఆరోగ్య భీమా పధకాన్ని వర్తింప జేసింది. వైద్య ఆరోగ్య రంగానికి అదనంగా కేటాయించిన రు.850 కోట్లను కుాడా కరోనాను కట్టడి చేసేందుకు వెచ్చించింది ప్రభుత్వం. దక్షిణ కొరియా, అమెరికాల్లో ఒకేరోజు జనవరి 21 న కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే మరణాలను కొరియా 230 కి పరిమితం చేయగా అగ్రరాజ్యం ఆ సంఖ్య వేలకు చేరుకుంది. ఇప్పటికీ కరోనా నుంచి బయటపడే పరిస్ధితిలో అమెరికా లేదు. ప్రజల సహకారం, చైతన్యంతో ఈ విజయం సాధించింది. కేసులు గుర్తించడం, పరీక్షలు జరపడం, చికిత్సలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టడంద్వారా కరోనా కొమ్మలను విస్తరించింది కరోనా. తద్వారా ఉత్పాతాలను, వైపరిత్యాలను ఎదుర్కొనే శక్తి తనకుందని నిరూపించింది. ఈ చిన్న సంపన్న దేశం.
-ఎడిటోరియల్ డెస్క్