మాజీ స్పీకర్లది రాజకీయ విషాదమేనా?
స్పీకర్ అని ఎందుకు అంటారో కానీ ఏ పొజిషన్ తీసుకున్న వారు రాజకీయంగా మాట్లాడకూడదు, పెద్దగా పార్టీతో సంబంధాలు నెరపకూడదు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసెంబీలో మాత్రమే [more]
స్పీకర్ అని ఎందుకు అంటారో కానీ ఏ పొజిషన్ తీసుకున్న వారు రాజకీయంగా మాట్లాడకూడదు, పెద్దగా పార్టీతో సంబంధాలు నెరపకూడదు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసెంబీలో మాత్రమే [more]
స్పీకర్ అని ఎందుకు అంటారో కానీ ఏ పొజిషన్ తీసుకున్న వారు రాజకీయంగా మాట్లాడకూడదు, పెద్దగా పార్టీతో సంబంధాలు నెరపకూడదు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసెంబీలో మాత్రమే గళం విప్పాలి. అది కూడా సందర్భానుసారం. గతంలో స్పీకర్లకు ఈ నిబంధన బాగానే ఉన్నా ఇప్పటి స్పీకర్లకు మాత్రం ఇది కత్తి మీద సామే. రాజకీయాల్లో మునిగి తేలుతున్న వారినే ఈ పదవులకు ఎంపిక చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా తమ బలం జులుం చూపాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లో రాటుదేలిన వారికే ఆ పదవులు ఇస్తున్నారు. దానికి తగినట్లుగా ఇప్పటి స్పీకర్లు బాగానే నోరు చేసుకుంటున్నారు. రాజకీయాలను బాగానే వల్లె వేస్తున్నారు. అయితే పదవి నుంచి దిగిపోయాక మాత్రం వారికి రాజకీయ గ్రహణమే పడుతోంది. ఆ కోవలో చాలా మంది స్పీకర్లు వర్తమానంలో కనిపిస్తున్నారు.
కొడెలది అనూహ్యమైన ముగింపు…..
రాజకీయాల్లో స్పీకర్ పదవులు అలంకరించిన వారు తరువాత కాలంలో మూలకు చేరుతారన్నది పెద్ద సెంటిమెంట్. ఉమ్మడి ఏపీలో పనిచేసిన ప్రతిభాభారతి ఆ తరువాత తెర మరుగు అయిపోయారు. ఆమె మళ్ళీ రాజకీయంగా ముందుకు అడుగు వేయలేకపోయారు. ఇక యనమల రామకృష్ణుడు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డా యాంటీ సెంటిమెంట్ నుంచి మెల్లగా తప్పించుకుని మంత్రి కాగలిగారు. అయితే ఆయన ఎమ్మెల్సీ ద్వారా మాత్రమే సభలో అడుగుపెట్టగలిగారు తప్ప తిరిగి ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఇక ఉమ్మడి ఏపీలో పనిచేసిన మరోకాయన నాదెండ్ల మనోహర్. ఆయన సైతం పదవి నుంచి దిగిపోగానే రాజకీయంగా కనుమరుగు అయ్యారు. ఇపుడు జనసేనలో కనిపిస్తున్నా ఆయన భవిష్యత్తు ఏంటన్నది డోలాయమానంగానే ఉంది. ఇక స్పీకర్ గా చేసి సీఎం అయిన ఒకాయన ఉన్నారు. ఆయనే కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి పదవి తరువాత రాజకీయంగా మూలకు చేరిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందొరో ఉన్నారు. ఇపుడు నవ్యాంధ్ర తొలి స్పీకర్ గా పనిచేసిన కొడెల శివప్రసాద్ ది మరీ దారుణం. ఆయన తాజా ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే కాదు, అనేక అవమానాల పాలై చివరకు ఆత్మహత్య చేసుకుని లోకాన్నే విడిచివెళ్లిపోయారు.
అధ్యక్ష్యా…. అన్న వారే…..
స్పీకర్ స్థానం ఉన్నతమైనదని, రాజ్యాంగపదవిలో ఉన్న వారిని గొప్పగా గౌరవించాలని చెప్పే అధినేతలు తరువాత కాలంలో వారిని కనీసంగా పట్టించుకున్న పాపాన పోరు. స్పీకర్ గా చేసిన వారికి టికెట్ కూడా ఇస్తారన్న గ్యారంటీ లేదు. కోడెల ఎంతో పోరాటం చేసి మరీ తాజా ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నారంటేనే ఆయన పరిస్థితి చెప్పకచెబుతోంది. ఇక స్పీకర్ పదవి నుంచి దిగిపోగానే వారికి గౌరవించడం మాట దేముడెరుగు. అవమానించడం కూడా అనేక చోట్ల చూస్తున్న పరిస్థితి. ఏది ఎలాగున్నా స్పీకర్లకు పదవులు మాత్రమే దక్కవని ఇంతవరకూ అంతా అనుకున్నారు. ఇపుడు జీవితాలు కూడా దక్కవని కోడెల ఉదంతం నిరూపించింది.