జోరు వెనక బాలయ్యేనా…?
బాలకృష్ణ వారసులు అంటే కొడుకు ఒక్కడే ఉన్నాడు. కానీ అతను సినిమాల్లోకి రావడంలేదు. ఇక బాలయ్య రాజకీయ వారసత్వంగా చూసుకుంటే లోకేష్ ని ఆ ఖాతాలో వేసేస్తున్నారు. [more]
బాలకృష్ణ వారసులు అంటే కొడుకు ఒక్కడే ఉన్నాడు. కానీ అతను సినిమాల్లోకి రావడంలేదు. ఇక బాలయ్య రాజకీయ వారసత్వంగా చూసుకుంటే లోకేష్ ని ఆ ఖాతాలో వేసేస్తున్నారు. [more]
బాలకృష్ణ వారసులు అంటే కొడుకు ఒక్కడే ఉన్నాడు. కానీ అతను సినిమాల్లోకి రావడంలేదు. ఇక బాలయ్య రాజకీయ వారసత్వంగా చూసుకుంటే లోకేష్ ని ఆ ఖాతాలో వేసేస్తున్నారు. నిజానికి లోకేష్ చంద్రబాబు వారసుడు. ఆ విధంగా చూసుకుంటే రాజకీయాల్లో బాలయ్య వారసుడి పోస్ట్ ఖాళీగానే ఉంది. దాన్ని భర్తీ చేసేందుకా అన్నట్లు చిన్నల్లుడు శ్రీ భరత్ ఈ మధ్య మాటల మెరుపులు మెరిపిస్తున్నాడు. తాజాగా జరిగిన విశాఖ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలు అయిన శ్రీ భరత్ వయసు ముప్పయ్యేళ్ళే. దాంతో రాజకీయంగా తనకు ఎంతో భవిష్యత్తు ఉందని ఆ ఓటమిని శ్రీ భరత్ లైట్ గా తీసుకున్నాడు. విశాఖలోనే ఉంటూ గీతం చైర్మన్ గా వుంటూ తన తాత దివంగత ఎంవీవీఎస్ మూర్తి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీ భరత్ ప్రణాళికాబద్దంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన వచ్చే అయిదేళ్ల రాజకీయాల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు.
లోకేష్ ని నెట్టగలరా…?
ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బాలయ్య పెద్దల్లుడు లోకేష్, చిన్నల్లుడు శ్రీ భరత్ ఇద్దరూ ఓడిపోయారు. శ్రీ భరత్ ఓటమి గురించి ఎవరూ మట్లాడుకోవడం లేదు కానీ లోకేష్ ఓటమి మాత్రం ఆయన్ని టీడీపీలో బాగా వెనక్కి నెట్టేసింది. పార్టీని లీడ్ చేయడానికి లోకేష్ ఎందుకూ పనికిరాడు అని మెజారిటీ తమ్ముళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలో చిన్నల్లుడు ఇపుడు మళ్ళీ జోరు పెంచుతున్నారు. ఆయన బాలయ్యనే కేరాఫ్ గా చెప్పుకుని టీడీపీ రాజకీయాల్లో తన పాత్రను, పరిధిని పెంచుకోవాలని చూస్తున్నారు. ఓ విధంగా లోకేష్ ఫెయిల్ కావడం కూడా శ్రీ భరత్ ఆశలను పెంచుతోంది. టీడీపీలో ఇపుడు నాయకులు లేరు, యువతరం నుంచి ప్రతినిధులు లేరు అన్న మాట గట్టిగా వినిపిస్తున్న వేళ శ్రీ భరత్ అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. తాజాగా ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీకి యంగ్ టాలెంట్ చాలా ఉందని చెప్పడం వెనక చాలా అర్ధాలు ఉన్నాయని అంటున్నారు.
జూనియర్ వద్దే వద్దట…..
ఓ వైపు ఉన్న పార్టీలో లోకేష్ సామర్ధ్యం అందరికీ తెలిసిన వేళ శ్రీ భరత్ గురించి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు, అవగాహన కూడా లేదు. సరిగ్గా దీన్నే సానుకూలం చేసుకుని పార్టీలో ఎదిగేందుకు శ్రీ భరత్ పావులు కదుపుతున్నారనుకోవాలి. ప్రస్తుతమున్న ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీయార్ అవసరం టీడీపీకి లేదని చెప్పి శ్రీ భరత్ కుండ బద్దలు కొట్టడం వెనక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. టీడీపీ నాయకత్వం ఎపుడూ నారా నందమూరి కుటుంబాల మధ్యనే తిరుగుతూ ఉంది. నారా వారసుడు లోకేష్ కి అంత టాలెంట్ లేదని తేలిన వేళ నందమూరి వారసునిగా ఆ స్లాట్ లో నుంచి జూనియర్ కాకుండా తాను ఎంట్రీ ఇవ్వాలన్న ఎత్తుగడతో శ్రీ భరత్ ఉన్నారని అంటున్నారు. మామయ్య అంటూ బాలకృష్ణ జపం చేస్తున్న శ్రీ భరత్ టీడీపీకి ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పడం ద్వారా తానున్నాను అన్న సంకేతాలను ఇటు హై కమాండ్ కి అటు పార్టీ నాయకులకు కూడా పంపుతున్నారు. బాలయ్యకు అల్లుడు కనుక ఎటూ నందమూరి ఫ్యామిలీ మద్దతు ఉంటుంది. ఇక బాలయ్యను ముందుంచుకుని వెళ్తే చంద్రబాబు కూడా ఏమీ అనలేరు. విశాఖ ఎంపీ టికెట్ కూడా అలాగే తెచ్చుకున్న శ్రీ భరత్ అదే వ్యూహంతో బాలయ్య రాజకీయ వారసత్వంతో టీడీపీలో తన హవాను పెంచుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. మరి చంద్రబాబు తన కుమారుడి వరస అయిన శ్రీ భరత్ రాజకీయ దూకుడుకి ఎలా చెక్ పెడతారో చూడాలి.