పరువు బజారున పడేస్తున్నాడే
వెండితెరపైన సింహంలా గర్జించే నందమూరి నట సింహం బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని తమ్ముళ్ళు అంటున్నారు. ఓ వైపు నందమూరి మూలపురుషుడు అన్న [more]
వెండితెరపైన సింహంలా గర్జించే నందమూరి నట సింహం బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని తమ్ముళ్ళు అంటున్నారు. ఓ వైపు నందమూరి మూలపురుషుడు అన్న [more]
వెండితెరపైన సింహంలా గర్జించే నందమూరి నట సింహం బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని తమ్ముళ్ళు అంటున్నారు. ఓ వైపు నందమూరి మూలపురుషుడు అన్న గారు స్థాపించిన తెలుగుదేశానికి సరైన యువ నాయకత్వం లేక అల్లలాడుతోంది. మరో వైపు అల్లుళ్ళు ఇద్దరూ యువనేతలుగా ఉన్నప్పటికీ సొంత చిక్కులూ చికాకులతో పార్టీ పరువు మరింత తీస్తున్నారని అంటున్నారు. విశాఖకు చెందిన శ్రీ భరత్ బాలయ్య రెండో అల్లుడు. ఆయన ఇద్దరు ఘనమైన తాతల రాజకీయ వారసుడు కూడా. పైగా గీతం డీమ్డ్ వర్సిటీ ఛైర్మన్ హోదా ఉంది. విశాఖ ఎంపీగా టీడీపీ తరఫున తాజా ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలు అయ్యారు. సరే పార్టీకి బలమైన నాయకత్వం ఇస్తారనుకుంటే వారే సమస్యలతో సతమవుతూ పార్టీ పరువుని బజారున పడేస్తున్నారని అంటున్నారు.
డీఫాల్టర్ నోటీసు…..
విశాఖలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ హఠాత్తుగా శ్రీ భరత్ సంస్థను డీఫాల్టర్ గా ప్రకటిస్తూ పత్రికలలో నోటీసులు అచ్చేసింది. దాంతో ఎవరీ భరత్ అని అంతా ఆరా తీస్తే తెలుగుదేశం యాజమాన్యం కుటుంబ సభ్యుడేనని తేలడంతో మరింత రాజకీయ రచ్చ అయింది. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో మొత్తం పరువు బజారున పడింది. దీన్ని కౌంటర్ చేసుకోవడాని శ్రీ భరత్ ఇచ్చిన సమాధానం కూడా రివర్స్ కొట్టడంతో చిన్నల్లుడు చిక్కుల్లో పడిపోయారు. విజయసాయిరెడ్డి మీద సెటైర్లు వేయబోయి బొక్క బోర్లా పడ్డాడు. దాంతో వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోయాడు. అతి పెద్ద పారిశ్రామిక రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీ భరత్ సంస్థకు ఇలా డీ ఫాల్టర్ నోటీసులు రావడమేంటని టీడీపీలోనూ వాడిగా వేడిగా చర్చ సాగుతోంది.
ఇదీ అసలు కధట….
విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద వీబీసీ ఎనర్జీ సంస్థను ఏర్పాటు చేసేందుకు పదమూడున్నర కోట్లను శ్రీ భరత్ ఆంధ్రా బ్యాంక్ నుంచి అప్పట్లో రుణంగా తీసుకున్నారు. రుణ బకాయిలు సరిగ్గా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చెల్లించందుకు గాను విశాఖలో ఉన్న ఆంధ్రా బ్యాంక్ శ్రీ భరత్ సంస్థను డీఫాల్టర్ గా ప్రకటించేసింది. మొత్తం సొమ్ము కట్టి తనఖాలో ఉన్న ఆస్తులను కాపాడుకోవాలని స్పష్టంగా పేర్కొంది. ఇంతవరకూ ఒకే కానీ ఆ తరువాత శ్రీ భరత్ ఈ మొత్తం వ్యవహారాన్ని ట్విస్ట్ చేయబోయి బోల్తా పడిన తీరే ఇపుడు టీడీపీలో పెద్ద చర్చ అవుతోంది.
వైసీపీ మీద బండ…
వైసీపీ సర్కార్ విద్యుత్ సంస్థల సమీక్ష పేరిట తమకు బకాయిలు విడుదల చేయకపోవడం వల్లనే తాను రుణాన్ని సకాలంలో చెల్లించలేదని శ్రీ భరత్ అడ్డంగా వైసీపీ సర్కార్ మీద ఓ బండ వేసేశారు. అయితే దీని మీద అసలు కధను బయటకు తీస్తే గత అక్టోబర్ నుంచే ట్రాన్స్ కో నుంచి శ్రీ భరత్ సంస్థకు బకాయిలు పేరుకుపోయాయని తేలింది. అంటే ఆనాటి నుంచి ఈ ఏడాది జూన్ వరకూ పవర్ లో ఉన్నది చంద్రబాబు సర్కార్. మరి తన సొంత ప్రభుత్వంలో బకాయిలు శ్రీ భరత్ తెచ్చుకోలేక ఇక్కడ బ్యాంక్ రుణ వాయిదాలు కట్టలేక డీఫాల్టర్ దాకా వ్యవహారం వెళ్ళింది. విషయం ఇంత క్లియర్ గా ఉంటే శ్రీ భరత్ మాత్రం తన సొంత విషయానికి రాజకీయ రంగు పులిమి అదేదో వైసీపీ మీద దాడి చేశామనుకున్నారు. ఇపుడు మొత్తం కధ వెలుగు చూడడంతో చిన్నల్లుడు కార్నర్ అయిపోయారు. ఇలాంటి తెలివైన అల్లుళ్ళను పెట్టుకుని బాలయ్య, ఆయన్ని నమ్ముకుని చంద్రబాబు టీడీపీ ఎలా నెట్టుకువస్తాయోనని తమ్ముళ్ళు తలపట్టుకుంటున్నారుట.