బాలయ్య అల్లుడి భీమిలీ లవ్ ?
చంద్రబాబు చేసిన రాజకీయానికి ఎన్నికలు అంటే జడుసుకునే పరిస్థితికి ఉత్తరాంధ్రా తమ్ముళ్ళు వచ్చేశారు. అమరావతి రాజధాని అంటూ బాబు జగన్ తో చెడుగుడు ఆడుతున్నాను అనుకుంటున్నారు కానీ [more]
చంద్రబాబు చేసిన రాజకీయానికి ఎన్నికలు అంటే జడుసుకునే పరిస్థితికి ఉత్తరాంధ్రా తమ్ముళ్ళు వచ్చేశారు. అమరావతి రాజధాని అంటూ బాబు జగన్ తో చెడుగుడు ఆడుతున్నాను అనుకుంటున్నారు కానీ [more]
చంద్రబాబు చేసిన రాజకీయానికి ఎన్నికలు అంటే జడుసుకునే పరిస్థితికి ఉత్తరాంధ్రా తమ్ముళ్ళు వచ్చేశారు. అమరావతి రాజధాని అంటూ బాబు జగన్ తో చెడుగుడు ఆడుతున్నాను అనుకుంటున్నారు కానీ మిగిలిన ప్రాంతాలలో సైకిల్ కి గాలి పోతోందని ఆలోచించడంలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో చాలా మంది తమ్ముళ్ళు గోడ దాటుదామని డిసైడ్ అవుతున్నారు. వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముందు వరసలో ఉన్నారు. ఇక ఆయన అనుచరగణం కూడా పెద్దగానే ఉంది. వారంతా జెండా ఎత్తేస్తే టీడీపీకి ఇబ్బందే. మిగిలిన వారు కూడా వచ్చే ఎన్నికల గురించి పెద్దగా ఆలోచించడంలేదు. ఒకవేళ పార్టీలో ఉండి పోటీ చేయాల్సివస్తే కంచు కోటలనే ఎంచుకోవడం మంచిదని భావిస్తున్నారుట.
ఎంపీగా వద్దా…?
బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ గతసారి విశాఖ ఎంపీ గా పోటీ చేశారు. జనసేన తరఫున జేడీ లక్ష్మీనారాయణ రంగంలోకి దిగకపోతే ఆయన గెలిచేసేవారు. జేడీ దిగి వైసీపీని గెలిపించేశారు. ఓట్ల చీలికే టీడీపీని భారీగా దెబ్బ కొట్టిందని శ్రీ భరత్ బాధపడ్డారు. ఇపుడు చూస్తే జనసేన, బీజేపీ రెండూ కూడా కూటమి కట్టి 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీకి పోటీ ఇస్తే టీడీపీకే మళ్ళీ కష్టం అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో శ్రీభరత్ ముందుగానే మరో వైపు కూడా కన్నేసి ఉంచారని అంటున్నారు.
అక్కడే పాగా ….
విశాఖ జిల్లాలోని భీమిలీ టీడీపీకి కంచుకోట. చివరి నిముషంలో అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అయిన మాజీ ఎంపీ సబ్బం హరిని టీడీపీ దించినా కూడా అవంతి శ్రీనివాస్ కి చుక్కలు చూపించారు. సరిగ్గా ప్రచారం చేయకపోయినా కూడా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే అవంతి ఇక్కడ విజయం సాధించడం విశేషం. అంత బలమైన చోటు కాబట్టే శ్రీ భరత్ కన్ను భీమిలీ మీద ఉంది అంటున్నారు. పైగా ఆయన నిర్వహిస్తున్న గీతం సంస్థలు భీమిలీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దాంతో ఎంపీగా పోటీ చేసి అన్ని చోట్ల సరిచూసుకోవడం కంటే భీమిలీని నమ్ముకుంటే విజయం తేలిక అవుతుంది అని శ్రీ భరత్ నమ్ముతున్నారుట.
బాబు ఓకేనా …?
ఇక తనకు కొడుకు వరస అయిన శ్రీభరత్ భీమిలీ వంటి సేఫెస్ట్ జోన్ నుంచి పోటీ చేస్తానంటే అధినేత చంద్రబాబు ఊరుకుంటారా అన్నది ప్రశ్న. అక్కడ నుంచి గెలిచి వచ్చి అసెంబ్లీలో శ్రీభరత్ కూర్చుంటే అది డైరెక్ట్ గా లోకేష్ కి దెబ్బేనని కూడా బాబుకు తెలుసు కదా. మరో వైపు విశాఖ ఎంపీ సీటుకు ఆర్ధికంగా బలమైన నాయకుడు కూడా టీడీపీకి లేరు. దాంతో ఎంపీ సీటుతో పాటు మిగిలిన ఎమ్మెల్యే సీట్లు కూడా పోగొట్టుకోవాల్సివస్తుంది. ఇలా రాజకీయంగా ఆర్ధికంగా బాబు లెక్కలు పక్కాగా ఉంటాయని అంటున్నారు. అయితే ఇప్పటివరకూ భీమిలీని సరైన టీడీపీ నాయకుడు లేడు. శ్రీ భరత్ ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుంచే గుడ్ బై కొట్టాలన్న ఆలోచనలో కూడా శ్రీభరత్ ఉన్నారట. అంటే 2024లో చంద్రబాబుకు చావో రేవో కాదు, చాలా మంది నాయకులకు కూడా గీటు రాయిగా ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.