అంతా ఆయన ఊహించినట్లుగానే… సాఫీగానే?
డీఎంకే అధినేత స్టాలిన్ ఊహించినట్లుగానే జరుగుతుంది. ఆయన అనుకున్నట్లు అంతా సాఫీగానే వెళుతుంది. తాను ఏదైతే అంచనా వేశారో అది నిజమవుతుంది. అవును.. స్టాలిన్ తన మిత్రపక్షాలను [more]
డీఎంకే అధినేత స్టాలిన్ ఊహించినట్లుగానే జరుగుతుంది. ఆయన అనుకున్నట్లు అంతా సాఫీగానే వెళుతుంది. తాను ఏదైతే అంచనా వేశారో అది నిజమవుతుంది. అవును.. స్టాలిన్ తన మిత్రపక్షాలను [more]
డీఎంకే అధినేత స్టాలిన్ ఊహించినట్లుగానే జరుగుతుంది. ఆయన అనుకున్నట్లు అంతా సాఫీగానే వెళుతుంది. తాను ఏదైతే అంచనా వేశారో అది నిజమవుతుంది. అవును.. స్టాలిన్ తన మిత్రపక్షాలను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. వారంతట వాళ్లే కూటమి నుంచి తప్పుకునేలా స్టాలిన్ ప్లాన్ వేశారని అనిపిస్తుంది. జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే కూటమిలోని అనేక పార్టీలు డీఎంకేకు దూరంగా జరిగేందుకు సిద్ధమయ్యాయి.
అంతా కూటములతోనే…..
తమిళనాడులో కూటములతోనే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా అధికారంలోకి వస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేలు కూటములతో ప్రతి ఎన్నికలోనూ బరిలోకి దిగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ కూటములతోనే వెళ్లాలని నిర్ణయించాయి. అయితే కూటమిలోని పార్టీలు ఎక్కువ స్థానాలను ఆశిస్తున్నాయి. తమిళనాడులో ఉన్న 234 అసెంబ్లీ స్థానాల్లో తన కూటమిలోని ఉన్న పార్టీలకు ఎక్కువ స్థానాలను కేటాయిస్తే మరోసారి అధికారానికి దూరం అవుతామన్న ఆందోళన స్టాలిన్ లో ఉంది.
చిన్నా చితకా పార్టీల వల్లనే…..
గత ఎన్నికల్లోనూ కూటమిలోని పార్టీలు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించలేకపోవడంతోనే డీఎంకే అధికారానికి దూరమయింది. అందుకే ఈసారి స్టాలిన్ ఆ తప్పు చేయదలచుకోలేదు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, డీపీఐ, ఐయూఎంఎల్, మణిదనేయ మక్కల్ కట్చి వంటి పార్టీలున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోరుతుంది. అయితే ఇరవైకి మించి ఇవ్వలేమని స్టాలిన్ తెగేసి చెబుతున్నారు.
కూటమి నుంచి తప్పుకునేందుకు…..
ఇక వైగో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ పదిహేను స్థానాలను ఆశిస్తుంది. ఈ మేరకు డీఎంకే అధినేత స్టాలిన్ కు ఆ పార్టీ తేల్చి చెప్పింది. అయితే స్టాలిన్ మాత్రం ఆ పార్టీకి అన్ని స్థానాలను ఇచ్చేందుకు సుముఖంగా లేరు. దీంతో వైగో పార్టీ కూటమి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా స్థానాల కేటాయింపులో అసంతృప్తిగా ఉంది. అయితే కాంగ్రెస్ కూటమి నుంచి తప్పుకునే అవకాశాలు లేవు. మిగిలిన పార్టీలు మాత్రం డీఎంకే అధినేత స్టాలిన్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. అవి ఏ క్షణంలోనైనా కూటమి నుంచి తప్పుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా కన్పిస్తున్నాయి.