ఇచ్చిన దాంతో సర్దుకోవాల్సిందే.. వేరే ఆప్షన్ లేదు
తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కూటమిలోని పార్టీలు తమ స్థానాల కోసం పట్టుబడుతున్నాయి. ప్రధానంగా డీఎంకే అధినేత స్టాలిన్ కు సీట్ల కేటాయింపు సమస్య ఎక్కువగా ఉంది. [more]
తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కూటమిలోని పార్టీలు తమ స్థానాల కోసం పట్టుబడుతున్నాయి. ప్రధానంగా డీఎంకే అధినేత స్టాలిన్ కు సీట్ల కేటాయింపు సమస్య ఎక్కువగా ఉంది. [more]
తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కూటమిలోని పార్టీలు తమ స్థానాల కోసం పట్టుబడుతున్నాయి. ప్రధానంగా డీఎంకే అధినేత స్టాలిన్ కు సీట్ల కేటాయింపు సమస్య ఎక్కువగా ఉంది. చిన్నా చితకా పార్టీలను పక్కన పెడితే ప్రధానంగా కాంగ్రెస్ కు బీహార్ ఎన్నికల ఫలితాలు సమస్యగా మారాయి. డీఎంకే అధినేత స్టాలిన్ ఈసారి కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలను కేటాయించకూడదని నిర్ణయించుకున్నారు.
ఆ ప్రతిపాదనను కూడా…..
డీఎంకే స్టాలిన్ చిన్న పార్టీల ముందు ఒక ప్రతిపాదన ఉంచారు. సీట్లు తీసుకున్నా తమ గుర్తు మీద పోటీ చేయాలని స్టాలిన్ కోరారు. అయితే దీనికి కూటమిలోని పార్టీలు అంగీకరించడం లేదు. తాము పార్టీ గుర్తింపును కోల్పోతామని అవి ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే తాము ఇచ్చినన్ని సీట్లను తీసుకోవాలని స్టాలిన్ షరతులు విధించారు. అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో గుర్తు విషయంలో ఆ పార్టీని కోరే అవకాశం లేదు.
తక్కువ స్థానాలను….
దీంతో స్టాలిన్ కాంగ్రెస్ కు వీలయినన్ని తక్కువ స్థానాలను కేటాయించాలని నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే 40 స్థానాలను కేటాయించినా ఎనిమిది స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ వల్లనే గత ఎన్నికల్లో 89 స్థానాలను డీఎంకే సాధించినా అధికారాన్ని అన్నాడీఎంకే కు అప్పగించాల్సి వచ్చింది. ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా ఈసారి స్టాలిన్ సీట్ల కేటాయింపులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ ససేమిరా……
ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన 8 స్థానాలతో పాటు మరో 19 స్థానాలను మాత్రమే కేటాయించాలని స్టాలిన్ డిసైడ్ చేసినట్లు తెలిసింది. కానీ కాంగ్రెస్ మాత్రం ససేమిరా అంటుంది. తమకు యాభై స్థానాలను కేటాయించాలని కోరుతుంది. బీహార్ ఎన్నికలతో ముడిపెడితే ఎలా కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. కానీ స్టాలిన్ మాత్రం వీలయినన్ని తక్కువ స్థానాలను మాత్రమే కేటాయించాలని నిర్ణయించడంతో ఆ పార్టీ డెసిషన్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.