తొలి అడుగులోనే స్టాలిన్ సక్సెస్
డీఎంకే అధినేత స్టాలిన్ అనుకున్నట్లుగానే జరుగుతుంది. అంత సాఫీగానే సాగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో స్టాలిన్ ముందకు వెళుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సయితం [more]
డీఎంకే అధినేత స్టాలిన్ అనుకున్నట్లుగానే జరుగుతుంది. అంత సాఫీగానే సాగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో స్టాలిన్ ముందకు వెళుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సయితం [more]
డీఎంకే అధినేత స్టాలిన్ అనుకున్నట్లుగానే జరుగుతుంది. అంత సాఫీగానే సాగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో స్టాలిన్ ముందకు వెళుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సయితం స్టాలిన్ అమలులో పెడుతున్నారు. దీంతో ఎన్నికలకు ముందే తమదే గెలుపు అన్న ధీమా డీఎంకేలో అడుగడుగునా కనపడుతుంది. డీఎంకే కూటమిలోని పార్టీలన్నీ స్టాలిన్ చెప్పినట్లే నడుచుకుంటూ ఉండానికి కూడా కారణమదే.
మిత్ర పక్షాలకు తాను అనుకున్నట్లుగానే…?
డీఎంకేలో అనేక పార్టీలున్నాయి. తన కూటమిలోని పార్టీలకు తాను అనుకున్నట్లుగానే స్టాలిన్ సీట్లను సర్దుబాటు చేశారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ తన పార్టీ అభ్యర్థులను 174 చోట్ల బరిలోకి దింపుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో డీెఎంకే పోటీ చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. మిత్ర పక్షాలకు సాధ్యమయినన్ని తక్కు వ స్థానాలను కేటాయించాలన్న ఆలోచనను ఆచరణలో స్టాలిన్ పెట్టేశారు.
కలిసి రావడంతో…..
కాంగ్రెస్ కు కేవలం 25 సీట్లనే ఇవ్వడం స్టాలిన్ ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుంది. ఇక అనేక పార్టీలకు వారు డిమాండ్ చేసిన సంఖ్యలో స్థానాలు ఇవ్వలేదు. అయినా డీఎంకే కూటమిలోని పార్టీలు స్టాలిన్ ఇచ్చిన స్థానాలతో సరిపెట్టుకున్నాయి. దీనికి కారణం ఈసారి ఖచ్చితంగా గెలుపు డీఎంకేదేనన్న నమ్మకం. అదే రజనీకాంత్ పార్టీ బరిలో ఉంటే స్టాలిన్ కు కూటమి నుంచే ఇబ్బందులు తలెత్తేవి.
కొన్ని పార్టీలకే మినహాయింపు….
దీంతో పాటు స్టాలిన్ కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలకు మాత్రమే గుర్తు నుంచి మినహాయింపు ఇచ్చారు. డీఎంకే సింబల్ ఉదయించే సూర్యుడు. ఈ గుర్తుపై ఈసారి 187 స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ ముస్లింలీగ్ లు వారి గుర్తులపైనే పోటీ చేస్తారు. మిగిలిన పార్టీలైన తమిళగ వాళ్వురిమై కట్చి, మక్కల విడుదలై కట్చి, తమిళర్ పేరవై, ఫార్వార్డ్ బ్లాక్ వంటి పార్టీలు డీఎంకే గుర్తుపైనే పోటీ చేస్తాయి. మొత్తం 14 స్థానాల్లో మిత్రపక్షాలకు చెందిన అభ్యర్థులు డీఎంకే గుర్తుపైనే పోటీ చేస్తున్నారు. దీంతో స్టాలిన్ ఇప్పటి నుంచే కూటమిని తన గుప్పిట్లో పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.