ఊపు మీద ఉన్న స్టాలిన్
డీఎంకే అధినేత స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని తక్షణమే అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారా? ఇప్పుడు ఉదయనిధి ఎమ్మెల్యే అయితే వచ్చే ఎన్నికల నాటికి ఉదయనిధి రాటుదేలతారని అనుకుంటున్నారా? [more]
డీఎంకే అధినేత స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని తక్షణమే అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారా? ఇప్పుడు ఉదయనిధి ఎమ్మెల్యే అయితే వచ్చే ఎన్నికల నాటికి ఉదయనిధి రాటుదేలతారని అనుకుంటున్నారా? [more]
డీఎంకే అధినేత స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని తక్షణమే అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారా? ఇప్పుడు ఉదయనిధి ఎమ్మెల్యే అయితే వచ్చే ఎన్నికల నాటికి ఉదయనిధి రాటుదేలతారని అనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి డీఎంకే శ్రేణులు. నిజానికి ఉదయనిధిని కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నియోజకవర్గంలోనే పోటీ చేయించాల్సి ఉంది. తాత నియోజకవర్గంలో మనవడికి స్థానం కల్పించాలన్న ఆనాటి ప్రతిపాదన ప్రతిపాదనగానే ఉండిపోయింది. తిరువారూర్ ఉప ఎన్నికలో ఉదయనిధి పోటీ చేయలేదు.
ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న…..
మరోసారి తమిళనాడులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెండు అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. తమిళనాడులోని విక్రంవాడి, నాంగునేరి శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. విక్రంవాడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాధామణి మరణించడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నాంగునేరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకుమార్ లోక్ సభ ఎన్నికల్లో గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది.
ఉదయ నిధిని పోటీకి….
అయితే నాంగునేరి నియోజకవర్గం నుంచి ఉదయనిధిని పోటీ చేయించాలని స్టాలిన్ గట్టిగా భావిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లు ఉండటంతో ఉదయనిధికి పొలిటికల్ ప్లాట్ ఫారం చూపించాలన్నది స్టాలిన్ అభిప్రాయం. ఇప్పటికే ఉదయనిధిని డీఎంకే యూత్ వింగ్ కు కార్యదర్శిగా చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో ఉదయనిధి ప్రచారం తమ పార్టీకి కలసి వచ్చిందని స్టాలిన్ గట్టిగా విశ్వసిస్తున్నారు.
కాంగ్రెస్ పట్టుబడుతున్నా…..
కానీ నాంగునేరి నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అందుకే కాంగ్రెస్ నేతలు తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. మిత్రపక్ష స్థానానికి ఎసరు పెట్టవద్దని కొంచెం గట్టిగానే చెబుతున్నారు. తాము ఖచ్చితంగా బరిలోకి దిగుతామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టంచేసింది. అయితే లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి ఊపు మీద ఉన్న స్టాలిన్ తన కుమారుడి రాజకీయం అరంగేట్రానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. మరి స్టాలిన్ ఉదయనిధిని బరిలోకి దింపుతారా? లేదా? అన్నది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తేలుతుంది.