సర్వేలో స్టాలిన్ కు ఆశ్చర్యపర్చే నిజాలు
తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. అయితే ఎవరికి వారు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వత [more]
తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. అయితే ఎవరికి వారు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వత [more]
తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. అయితే ఎవరికి వారు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వత డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నారు. ప్రతి నియోజవకర్గంలో చేయించిన సర్వేలో డీఎంకే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలిందట. సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివిధ మీడియా సంస్థలు నిర్వహిస్తుంటాయి.
అత్యధిక స్థానాల్లో…..
అయితే పోలింగ్ కు, కౌంటింగ్ కు మధ్య దాదాపు ఇరవై రోజుల సమయం ఉండటంతో స్టాలిన్ ఈ ప్రత్యేక సర్వే చేయించనట్లు తెలిసింది. ఈ సర్వేలో డీఎంకేకు 170కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని తేలిందట. అంతేకాదు మరో యాభై నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉందని చెబుతున్నారు. డీఎంకేతో పాటు ఈసారి తమ పార్టీ మిత్రపక్షాలు సయితం అత్యధిక స్థానాల్లో గెలుచుకుంటాయని స్టాలిన్ జరిపిన సర్వేలో తేలింది.
మిత్రపక్షాలు కూడా…..
డీఎంకే అధినేత స్టాలిన్ ఈసారి విజయం తనదేనన్న నమ్మకం తొలి నుంచి పెట్టుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ వైపు చూపిన ఆదరణ చెక్కు చెదరలేదని విశ్వసిస్తున్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లోకూడా వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని సొంత సర్వేలో తేలడంతో స్టాలిన్ పార్టీలో ఉత్సాహం అలుముకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా స్టాలిన్ చూసుకుంటున్నారట.
ప్రచారంలోనూ….
స్టాలిన్ ప్రచారాన్ని కూడా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించారు. గత జనవరి 29న ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన మీ నియోజకవర్గంలో స్టాలిన్ పేరుతో గ్రామ సభలను నిర్వహించారు. స్టాలిన్ 60 బహిరంగసభల్లో పాల్గొన్నారు. దాదాపు పన్నెండు వేల కిలోమీటర్ల మేరకు ఆయన ప్రయాణం చేశారు. ఇలా స్టాలిన్ ప్రచారంలోకూడా తాను ముందు ఉన్నారు. పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో తానే తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి అని స్టాలిన్ గట్టిగా భావిస్తున్నారు. మే 2వ తేదీన ఫలితాలతో దీనిపై స్పష్టత రానుంది.