24 గంటలే.. భవితవ్యం తేలనుందా?
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ప్రధానంగా డీఎంకే అధినేత స్టాలిన్ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఈ ఎన్నికలపై ఎన్నో [more]
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ప్రధానంగా డీఎంకే అధినేత స్టాలిన్ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఈ ఎన్నికలపై ఎన్నో [more]
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ప్రధానంగా డీఎంకే అధినేత స్టాలిన్ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి విజయం తథ్యమని నమ్ముతున్నారు. ఒపీనియన్ పోల్స్ కూడా స్టాలిన్ కు అనుకూలంగా రావడంతో విజయం ఖాయమనే ఆయన విశ్వసిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు స్టాలిన్ సిద్దమవుతున్నారు.
పదేళ్ల పాటు…..
పదేళ్ల పాటు డీఎంకే అధికారానికి దూరంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నది స్టాలిన్ కల. తన తండ్రి కరుణానిధి బాటలోనే ఆయన నడవాలనుకున్నారు. పదేళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా క్యాడర్ చేజారిపోకుండా బాగానే నెట్టుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ స్టాలిన్ పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. ఇది స్టాలిన్ కు ప్లస్ గా మారిందంటున్నారు.
అడ్డంకులన్నీ తొలగడంతో…..
ఇక ఈ ఎన్నికల్లో గెలుపు కోసం స్టాలిన్ శ్రమించారు. అదృష్టం కొద్దీ ఆళగిరి, రజనీకాంత్ వంటి అడ్డంకులన్నీ ఈ ఎన్నికల్లో పెద్దగా ఎదురు కాలేదు. పోలింగ్ తర్వాత స్టాలిన్ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులతో సమావేశమయ్యారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దాదాపు 170 స్థానాలను కైవసం చేసుకుంటామని స్టాలిన్ బలంగా విశ్వసిస్తున్నారు. ఓటమి పాలయ్యే కొన్ని స్థానాలను కూడా గుర్తించారంటున్నారు.
ఊహించిన దానికన్నా….
బలహీనమనుకున్న అన్నాడీఎంకే కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చింది. అయినా స్టాలిన్ కు విజయావకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. తమిళనాడులో ఈసారి అధికారం రాకపోతే డీఎంకేతో పాటు స్టాలిన్ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాలిన్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా స్టాలిన్ మాత్రం టెన్షన్ కు గురవుతున్నారు. మరికొద్ది గంటల్లోనే స్టాలిన్ భవిష్యత్ తేలనుంది.