పోలీసుల మైండ్ గేమ్ తో మావోలకు ముప్పు ?
ల్యాండ్ మైన్ లతో దండకారణ్యం లో పోలీసులను హడలెత్తించే మావోయిస్టు లకు ఇప్పుడు కరోనా రూపం లో వైరస్ కాటు గట్టిగానే వేస్తుంది. దీని సంగతి పక్కన [more]
ల్యాండ్ మైన్ లతో దండకారణ్యం లో పోలీసులను హడలెత్తించే మావోయిస్టు లకు ఇప్పుడు కరోనా రూపం లో వైరస్ కాటు గట్టిగానే వేస్తుంది. దీని సంగతి పక్కన [more]
ల్యాండ్ మైన్ లతో దండకారణ్యం లో పోలీసులను హడలెత్తించే మావోయిస్టు లకు ఇప్పుడు కరోనా రూపం లో వైరస్ కాటు గట్టిగానే వేస్తుంది. దీని సంగతి పక్కన పెడితే ఈ వైరస్ పేరు చెప్పి పోలీసులు ఆడుతున్న మైండ్ గేమ్ కి మావోయిస్టు ల శిబిరం లో గందరగోళం నెలకొందని తెలుస్తుంది. కరోనా వచ్చి అడవుల్లో దిక్కులేని చావు చావకండి. వచ్చి స్వచ్ఛందంగా లొంగి పోండి . మీకు మంచి వైద్యం అందించి జనజీవన స్రవంతిలోకి పంపుతాం అంటూ చత్తిస్ ఘడ్, తెలంగాణ, ఆంధ్రా, ఒడిస్సా పోలీసులు తమ తమ ప్రాంతాల్లో వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఒకరి తరువాత ఒకరు. దాంతో ఒక్కసారిగా ఆంధ్రఒరిస్సా బోర్డర్ పరిధిలోని ఎఓబి లో ఆందోళన మొదలైంది.
వైఎస్ హయాంలో గట్టి దెబ్బ …
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మావోయిస్టు లతో సర్కార్ చర్చలు జరిపింది. ఆ తరువాత ఈ చర్చలు ఫలప్రదం కాకపోగా వరుసగా వారి గుట్టుమట్లు తెలుసుకున్న గ్రే హౌండ్స్ అన్నల అగ్రనేతలను ఎన్ కౌంటర్లు చేస్తూ చావుదెబ్బ తీశాయి. ఆ తరువాత ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తులను కానీ పోలీసుల స్నేహ హస్తాలను అందుకునే ప్రయత్నాలను మావోయిస్టు లు చేసేందుకు సాహసించలేదు. కానీ ఇప్పడు తాజాగా మరో రూపంలో ఉద్యమం నుంచి వారు బయటకు రావలిసిన దుస్థితి దాపురించింది.
పిట్టల్లా రాలిపోతున్నారు …
ఇటీవల కేంద్ర కమిటీ సభ్యుల నుంచి రాష్ట్రస్థాయి లో పేరున్న నేతలు కరోనా బారిన పడి మృతి చెందారు. పలువురు మావోయిస్టులు చికిత్స కోసం మైదాన ప్రాంతాలకు వెళుతూ పోలీసులకు చిక్కిపోయారు. ఇంకా అనేకమంది ఇప్పటికి కరోనా బారిన పడి సరైన వైద్యం లేక దట్టమైన అరణ్యంలో ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో కీలక నేతలనుంచి సాధారణ దళ సభ్యులవరకు పోలీసుల ఆఫర్ బాగుందనే ఆలోచన మొదలైందని తెలుస్తుంది.
కొత్త రిక్రూట్ మెంట్ కోసం…?
గిరిజనులతో ఇటీవల కొత్త రిక్రూట్ మెంట్ ల కోసం సమావేశం అయిన సందర్భంలో కరోనా సోకిందని దీనికి సరైన చికిత్స ,విశ్రాంతి, మందులు లభించక ఎన్నాళ్ళు ఇలా అనే వ్యధ వారిని వెంటాడుతోందని దీనికి తోడు గ్రే హౌండ్ బలగాలు దండకారుణ్యాన్ని జల్లెడ పడుతూ ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి కావడం కన్నా పోలీసులకు లొంగి పోయే ఆలోచనే సరైంది అన్న పంథా లో కొందరు మావోయిస్టుల ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల అనారోగ్య కారణాలతో పలువురు మావో లు సైతం లొంగిపోవడం దీనికి నిదర్శనమని ఖాకీల లెక్కలు గమనిస్తే మావోలకు గడ్డుకాలం కరోనా రూపంలో వచ్చినట్లే కనపడుతుంది.