స్వామి భక్తికి కారణం అదేనా?
ఆయన వివాదాస్పద రాజకీయ నాయకుడిగా అంతా చూస్తారు. ఆయనతో పెద్ద చిక్కు ఏంటి అంటే తాను ఉన్న పార్టీనే గట్టిగా విమర్శిస్తారు. ఆయనకు ఎవరూ లెక్క ఉండదు. [more]
ఆయన వివాదాస్పద రాజకీయ నాయకుడిగా అంతా చూస్తారు. ఆయనతో పెద్ద చిక్కు ఏంటి అంటే తాను ఉన్న పార్టీనే గట్టిగా విమర్శిస్తారు. ఆయనకు ఎవరూ లెక్క ఉండదు. [more]
ఆయన వివాదాస్పద రాజకీయ నాయకుడిగా అంతా చూస్తారు. ఆయనతో పెద్ద చిక్కు ఏంటి అంటే తాను ఉన్న పార్టీనే గట్టిగా విమర్శిస్తారు. ఆయనకు ఎవరూ లెక్క ఉండదు. తన సొంత పంధాలో రాజకీయాలు చేసుకుంటూ పోతారు. పార్టీ లైన్స్, జెండాలు అజెండాలు ఏవీ ఆయన నోటి దూకుడుకు అడ్డురావు అంటారు. ఆయనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఆయన బీజేపీలో 2013లో చేరారు. ఆ తరువాత 2016లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు.
అదే కినుక …
మోడీని అప్పట్లో ఫుల్ సపోర్ట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి తన సీనియారిటీ ఆధారంగా మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఆశించారు. ఆయన గతంలో ఒకసారి ఆర్ధిక మంత్రిగా పనిచేయడంతో పాటు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు తన అనుభవం అన్నీ పనికివస్తాయనుకున్నారు. కానీ మోడీ అరుణ్ జైట్లీకి ఆ పదవి ఇచ్చారు ఆ తరువాత రెండవ టెర్మ్ లో నిర్మలా సీతారామన్ కి ఆర్ధిక మంత్రిని చేశారు. దాంతో సొంత ప్రభుత్వం మీదనే సుబ్రహ్మణ్యస్వామి పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. మోడీ సర్కార్ అమలు చేస్తున్న ఆర్ధిక సంస్కరణలను , ప్రైవేటీకరణ విధానాలను సుబ్రహ్మణ్యస్వామి గట్టిగానే తప్పు పడుతున్నారు. ఇక స్వామి రాజ్య సభ్య సభ్యత్వం 2022లో పూర్తి అవుతోంది. మళ్లీ ఆయనని నామినేట్ చేసే సీన్ ఏదీ బీజేపీలో ఉండదు అన్నది రాజకీయం తెలిసిన వారు ఎవరైనా చెప్పే మాట.
జగన్ తో బంధం…..
ఇక రాజ్యసభ్య సభ్యుడిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి జగన్ తో కొత్త బంధం కలిసింది. ఆయన జగన్ ని గత కొంతకాలంగా గట్టిగానే పొగుడుతున్నారు. అవుట్ రేట్ గా సపోర్ట్ చేస్తున్నారు. జగన్ మీద బీజేపీ సహా అంతా హిందూర్వ వ్యతిరేకిగా ముద్ర వేయాలని చూసిన నాడు జాతీయ స్థాయిలో పెద్ద గొంతు చేసి జగన్ కి రక్షణగా నిలిచింది సుబ్రహ్మణ్యస్వామి మాత్రమే. జగన్ కంటే పెద్ద హిందువు ఎవరుంటారు అంటూ ఆయన లాజికల్ గా చేసిన వాదన జాతీయా మీడియా దృష్టిని కూడా ఆకట్టుకుంది. ఇక జగన్ కి ఢిల్లీ లెవెల్ లో సుబ్రహ్మణ్యస్వామి లాంటి న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు అండగా ఉండడం కూడా ప్రత్యర్ధి పార్టీలను తగ్గి ఉండేలా చేస్తోంది.
జగన్ అభయం …
వచ్చే ఏడాది ఏపీ నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. ఏపీ అసెంబ్లీలో ఉన్న బలం బట్టి చూస్తే అవన్నీ కూడా వైసీపీ పరం అవుతాయి. జగన్ అధికారంలోకి వచ్చాక 2020లో ఆరు సీట్లు ఖాళీ అయితే అందులో ఒకటి గుజరాత్ కి చెందిన పరిమళ్ నత్వానీకి ఇచ్చారు. ఇపుడు కూడా అలాంటి కోటానే సుబ్రహ్మణ్యస్వామి ఆశిస్తున్నారు అంటున్నారు. జగన్ సైతం స్వామి పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏపీకి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామిని ఇంటికి స్వయంగా పిలిపించుకుని విందు కూడా ఇచ్చారు అంటే జగన్ ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్ధమవుతోంది కదా. దాంతో స్వామికి ఈసారి ఏపీ నుంచి రాజ్య సభ బెర్త్ ఖాయమైందని అంటున్నారు. మొత్తానికి స్వామిని తన వైపు ఉంచుకుని ఢిల్లీ రాజకీయాల్లో జగన్ ఎంత మేరకు నెగ్గుకువస్తారు అన్నది చూడాలి.