“సుజనా” సుఖినోభవంతు.. లాక్ డౌన్ లో “లాక్” తీసేశారుగా
లాక్ డౌన్ కాలాన్ని చంద్రబాబు చక్కగా వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు ఫోన్ చేయడానికి కారణం బీజేపీ నేత సుజనా చౌదరి కారణమన్న ప్రచారం హస్తినలో [more]
లాక్ డౌన్ కాలాన్ని చంద్రబాబు చక్కగా వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు ఫోన్ చేయడానికి కారణం బీజేపీ నేత సుజనా చౌదరి కారణమన్న ప్రచారం హస్తినలో [more]
లాక్ డౌన్ కాలాన్ని చంద్రబాబు చక్కగా వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు ఫోన్ చేయడానికి కారణం బీజేపీ నేత సుజనా చౌదరి కారణమన్న ప్రచారం హస్తినలో జోరుగా జరుగుతోంది. సుజనా చౌదరి ప్రమేయంతోనే ప్రధాన మంత్రి కార్యాలయం చంద్రబాబు కాల్ కు వేగంగా స్పందించిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా వేచి చూస్తున్న సమయం కరోనా రూపంలో సుజనా చౌదరికి కూడా కలసి వచ్చినట్లయింది.
నమ్మిన నేతగా…..
సుజనా చౌదరి దశాబ్ద కాలం నుంచి తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ అనేకంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా సుజనా చౌదరని చెప్పుకోవచ్చు. సుజనా చౌదరికి రాజ్యసభ పదవి ఇవ్వడమే కాకుండా, 2014లో ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా చంద్రబాబు చలవ వల్లే లభించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి తొలుత జంప్ అయిన నేత సుజనా చౌదరి. ఆయనే కాకుండా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీని పెద్దల సభలో కమలంలో కలిపేశారు.
బీజేపీలో ఉన్నప్పటికీ…..
బీజేపీలో ఉన్నా సుజనా చౌదరి మనసంతా కరకట్టపైనే ఉంటుందనడం వాస్తవం. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కన్నా, టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు ప్రయోజనాలను ఆశించే బీజేపీలోకి వెళ్లిపోయారని, ఇందుకు చంద్రబాబు అంగీకారం ఉందన్నది ఆ పార్టీని వీడిన నేతలందరూ ఆరోపిస్తున్న విషయమే. బీజేపీలో చేరిన దగ్గర నుంచి సుజనా చౌదరి టార్గెట్ అంతా వైసీపీ ప్రభుత్వంపైనే ఉంది. ఆయన రాజధాని మార్పు, శాసనమండలి రద్దు వంటి విషయాల్లో జగన్ ను ఏకిపారేస్తున్నారు. సరైన సమయంలో కేంద్రం జోక్యం తీసుకుంటుందని కూడా జగన్ సర్కార్ కు వార్నింగ్ ఇస్తున్నారు.
షా మాత్రం ససేమిరా అంటుండటంతో…..
ఇప్పటికీ టీడీపీ నేతలు అనేక మంది సుజనా చౌదరితో టచ్ లో ఉంటారు. ఆదినారాయణరెడ్డి, సూర్యనారాయణరెడ్డి వంటి వాళ్లు బీజేపీలో చేరడానికి సుజనా సాయాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు, కేంద్రంలోని పెద్దలకు మధ్య సయోధ్యకు సుజనా చౌదరి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే అమిత్ షా చంద్రబాబు విషయంలో కొంత కఠినంగా ఉండటంతో సానుకూలత వచ్చే వరకూ వెయిట్ చేయాలని సమయం కోసం వెయట్ చేస్తున్నారట. అయితే కరోనా విషయంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయిన్ బుల్ ట్రాన్స్ ఫర్మేషన్ సంస్థను నెలకొల్పారు. దాని పేరిట చంద్రబాబు ప్రధాని కార్యాలయానికి లేఖ రాయడం, దానిని సుజనా చౌదరి ఫాలో అప్ చేయడం చకాచకా జరిగిపోయాయంటున్నారు. సో.. మోదీకి, చంద్రబాబుకు కనెక్ట్ చేసింది సుజనా చౌదరి అన్న టాక్ ఇప్పడు జోరుగా నడుస్తోంది.