ఎందుకంత యాక్టివ్ గా ఉన్నారో?
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో కన్నా బీజేపీలో చేరాక ఎక్కువ యాక్టివ్ అయినట్లు కనపడుతోంది. ఆయనకు రాజ్యసభ పదవి మళ్లీ [more]
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో కన్నా బీజేపీలో చేరాక ఎక్కువ యాక్టివ్ అయినట్లు కనపడుతోంది. ఆయనకు రాజ్యసభ పదవి మళ్లీ [more]
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో కన్నా బీజేపీలో చేరాక ఎక్కువ యాక్టివ్ అయినట్లు కనపడుతోంది. ఆయనకు రాజ్యసభ పదవి మళ్లీ దక్కుతుందా? లేదా? అని పక్కన పెడితే ఢిల్లీలో పార్టీలో అల్లుకుపోయే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ప్రధానంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. అమిత్ షా ఉన్నప్పుడు కంటే సుజనా చౌదరి ఇప్పుడు కేంద్ర నాయకత్వంపై పట్టు సాధించారని చెబుతున్నారు.
బీజేపీ నేత కన్నా….
సుజనా చౌదరి బీజేపీ నేత కన్నా ఢిల్లీ మీడియాలో టీడీపీ నేతగానే ఎక్కువగా పరిచయం. జాతీయ మీడియా ఇప్పటికీ ఆయనను టీడీపీ నేతగానే చూస్తుంది. అనేక మీడియా సమావేశాల్లో సుజనా చౌదరిని టీడీపీ పై ప్రశ్నలు వేయడం ఇందుకు నిదర్శనం. సుజనా చౌదరి కూడా ఈ నాలుగేళ్లు సుఖంగా లాగించేయడానికే బీజేపీలో చేరారు. ఆయన వల్ల ఏపీలో పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదని తెలిసినా రాజ్యసభలో బలం కోసమే చేర్చుకున్నారన్నది కూడా వాస్తవం.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు…..
సుజనా చౌదరి మనసంతా ఏపీలోని ప్రభుత్వంపైనే ఉంటుంది. తాజాగా ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయిన నిధుల గురించి చెబుతున్నారు. ఏపీకి కష్టసమయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందని అంటున్నారు. ఇప్పటికే ఏపీకి వివిధ పథకాల కింద 10,947 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందంటున్నారు. పథ్నాలుగు ఆర్థిక సంఘం నిధులు 870 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో 1892 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇవి కాకుండా రైతులకు పీఎం కిసాన్ యోజన కింద 920 కోట్లను విడుదల చేస్తుందని చెప్పారు.
విమర్శలు చేస్తూనే……
ఇలా సుజనా చౌదరి ఏ ఏ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చాయో చెబుతూనే జగన్ ప్రభుత్వం ఈ నిధులు తమవిగా ప్రచారం చేసుకుంటుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం రాజకీయమేనని ఆయన అంటున్నారు. సహాయ కార్యక్రమాల పేరుతో లాక్ డౌన్ నిబంధనలు వైసీపీ నేతలు ఉల్లంఘించడం వల్లనే కరోనా వైరస్ ఏపీలో పెరుగుతుందన్నారు. ఇలా సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయని చెబుతూ పార్టీ నాయకత్వాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వైసీపీని విమర్శిస్తూ టీడీపీ పంథాలో నడుస్తున్నారు.