టచ్ లో ఉంది చంద్రబాబేనా?
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హరికధలు చెప్పడం బాగా నేర్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మరింత ఎక్కువయింది. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు [more]
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హరికధలు చెప్పడం బాగా నేర్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మరింత ఎక్కువయింది. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు [more]
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హరికధలు చెప్పడం బాగా నేర్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మరింత ఎక్కువయింది. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తమవైపు చూస్తున్నారని చెప్పడం సంచలనమే అయినా ఇది ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి సుజనా చౌదరి చెప్పినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూసే అవకాశమే లేదు. ఎందుకంటే వైసీపీ ఏపీలో అధికారంలో ఉంది. వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యుల సంగతి మాత్రం చెప్పలేం. ఒకవేళ ఎంపీలు బీజేపీలో చేరితే చేరవచ్చు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పడం వెనక మర్మమేంటన్నది ఆసక్తిగా ఉంది.
ఇరవై మంది టచ్ లో ఉన్నారంటూ….
ఇక వైసీపీి సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని సుజనా చౌదరి వదలలేదు. ఇరవై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఇది కూడా సందేహమే. ఎందుకంటే సుజనా చౌదరి వదిలేసింది చంద్రబాబు, బాలకృష్ణ మరొక ఎమ్మెల్యేను మాత్రమే. వీరిద్దరూ కాకుండా ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ టీడీపీ లో మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరతామని చెప్పారు.
ఒకరిద్దరు మాత్రం…..
మిగిలిన 22 మంది ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నట్లు కనపడుతుంది. గంటా శ్రీనివాసరావుతో పాటు విశాఖకు చెందిన మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారన్న ప్రచారం ఉంది. అయితే సుజనా చౌదరి ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం రాజకీయంగా చర్చకు దారితీసింది. అయితే సుజనా చౌదరి వ్యాఖ్యలు సీరియస్ గా లేవనే అనిపిస్తుంది. టీడీపీలో చంద్రబాబుతో సహా 11 మంది కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కొంత మంది మాత్రమే కాస్త అటుఇటుగా కన్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సీరియస్ గా తీసుకోబోమంటున్న…..
అయితే సుజనా చౌదరి వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు విన్పిస్తున్నాయి. సుజనా చౌదరితో నిత్యం టచ్ లో ఉండేది చంద్రబాబు మాత్రమేనని పోస్టింగ్ లు కనపడుతున్నాయి. సుజనా చౌదరిని దగ్గరుండి చంద్రబాబే బీజేపీలోకి పంపించారన్న వాదనా టీడీపీలోనే వినపడుతోంది. సుజనా చౌదరి వ్యాఖ్యలను బట్టి చంద్రబాబుతో సహా 20 మంది తనతో టచ్ లో ఉన్నారని చెప్పారా? అని కొందరు నెటిజెన్లు ఎద్దేవా చేస్తున్నారు. అందుకే సుజనా చౌదరి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోబోమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సుజనా చౌదరి ప్రజాబలం లేని నేత అని, ఆయనను నమ్ముకుని బీజేపీలోకి ఎవరూ వెళ్లరని టీడీపీ ధీమాగా ఉంది.