అలా లాగేస్తున్నారు మరి
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కి కుడి భుజంగా మొన్నటి ఎన్నికల ముందు వరకు వ్యవహరించిన సుజనా చౌదరి కమలం తీర్ధం పుచ్చుకున్నా తన స్వామి భక్తిని వీడటం [more]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కి కుడి భుజంగా మొన్నటి ఎన్నికల ముందు వరకు వ్యవహరించిన సుజనా చౌదరి కమలం తీర్ధం పుచ్చుకున్నా తన స్వామి భక్తిని వీడటం [more]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కి కుడి భుజంగా మొన్నటి ఎన్నికల ముందు వరకు వ్యవహరించిన సుజనా చౌదరి కమలం తీర్ధం పుచ్చుకున్నా తన స్వామి భక్తిని వీడటం లేదు. తన వ్యాపార అవసరాలు, బిజెపి కి రాజ్యసభలో ఎంపీల సంఖ్యాబలం వెరసి, ఉభయతారకంగా అవసరం కావడంతో చక్కగా గతంలో పెట్టిన కేసుల బాధ తీవ్రం కాకుండా సుజనాచౌదరి తన గ్యాంగ్ తో టిడిపి నుంచి కమలం లోకి జంప్ చేసేసారు. కానీ మనిషి బిజెపి లో వున్నా మనసంతా టిడిపి లోనే ఉందనేది ఆయన కమలం చెయ్యి అందుకున్న నాటినుంచి చేతల్లో చూపించేస్తున్నారు. టిడిపి లో పెద్దగా సీన్ లేని వారిని తనలాగా వ్యాపార అవసరాలు ఉండేవారిని మాత్రమే కాషాయ కండువా కప్పిస్తూ బండి నెమ్మదిగా లాగిస్తున్నారు. తన పాత మిత్రులతో హాయిగా విందు వినోదాలతో ఎప్పటికప్పుడు కేంద్రంలోని తమ సర్కార్ అప్ డేట్స్ అందిస్తూ సదా తన సహకారం సైకిల్ కి ఉంటుందని చెప్పక చెప్పేస్తున్నారు.
తాజాగా కరణం తో విందు ….
గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఇటీవల దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. గాంధీ బాటలో అంతా నడవాలని పిలుపునిస్తూ నేతలంతా రోడ్డెక్కారు. ఈ క్రమంలో సుజనా చౌదరి కూడా ఎపి లో బాగానే యాత్రల్లో పాల్గొంటూ వస్తున్నారు. అందులోభాగంగా ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు సుజనా చౌదరి టిడిపి ఎమ్యెల్యే కరణం బలరాం ఇంట్లో భోజనం చేయడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బలరాం తో ఈ భేటీ సాధారణం అయినదేనని తామిద్దరం ఎప్పటినుంచో మిత్రులంటూ సుజనా చౌదరి వివరణ ఇచ్చుకున్నా ఆయన వ్యవహారశైలిపై మాత్రం అటు కమలం లోను ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
కోవర్టులంటూ…..
నిన్నమొన్నటివరకు తన బంధువు తన పాత పార్టీ సహచరుడు గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ తో కూడా సుజనా చౌదరి బిజెపి లో ఉంటూనే సన్నిహితంగా మెలిగారు. తాజాగా వంశి వైసిపి వైపు చూడటం తో ఇకపై సుజనా చౌదరి తో స్నేహం ఏమేరకు కొనసాగుతుందో చూడాలి. సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటి వారిని చంద్రబాబు బిజెపి లోకి పంపారని ఇటీవలే వైసిపి లోకి వస్తూ మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు ఆరోపించారు. ఇవన్నీ గమనిస్తే బిజెపి, వైసిపి లోకి వెళ్లేవారు ఆ పార్టీల అభివృద్ధికి పనిచేసేవారా లేక టిడిపి కోవర్ట్ లా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.