ఈ స్టార్ కు ఇప్పుడైనా చాన్స్ దొరుకుతుందా?
కేరళ ఎన్నికల్లోనూ బీజేపీ సినిమా స్టార్లను రంగంలోకి దించింది. వీరిలో ప్రధానంగా చెప్పుకోదగ్గ స్టార్ సురేష్ గోపి. మళయాల చిత్రసీమలో సురేష్ గోపికి మంచి పేరుంది. లక్షల [more]
కేరళ ఎన్నికల్లోనూ బీజేపీ సినిమా స్టార్లను రంగంలోకి దించింది. వీరిలో ప్రధానంగా చెప్పుకోదగ్గ స్టార్ సురేష్ గోపి. మళయాల చిత్రసీమలో సురేష్ గోపికి మంచి పేరుంది. లక్షల [more]
కేరళ ఎన్నికల్లోనూ బీజేపీ సినిమా స్టార్లను రంగంలోకి దించింది. వీరిలో ప్రధానంగా చెప్పుకోదగ్గ స్టార్ సురేష్ గోపి. మళయాల చిత్రసీమలో సురేష్ గోపికి మంచి పేరుంది. లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కేరళలోని త్రిసూర్ నియోజవకర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేష్ గోపీ ఓటమి పాలయ్యారు. ఈసారి తన అదృష్టాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ గోపి పరీక్షించుకుంటున్నారు.
సీనియర్ నటుడిగా…..
సురేష్ గోపి కన్నడ, తమిళ, మళయాల, తెలుగు చిత్రాల్లో నటించారు. దాదాపు 200 చిత్రాలకు పైగా నటించిన సీనియర్ నటుడు ఆయన. ఆయనకు అన్ని రాష్ట్రాల్లో అభిమానులున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సురేష్ గోపిని భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా త్రిసూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలోకి దించడంతో అక్కడ తీవ్రమైన పోటీ నెలకొంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేష్ గోపీని అసెంబ్లీ ఎన్నికల్లో దించడం వెనక కూడా సీట్ల సంఖ్యను పెంచుకునేందుకే నంటున్నారు.
త్రిసూర్ నుంచి…..
అయితే సురేష్ గోపీ గెలుపు అంత నల్లేరు మీద నడక మాత్రం కాదు. సీని నటుడు కావడంతో గెలుస్తామన్న ధీమా బీజేపీలో ఉన్నప్పటికీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు సయితం బలమైన అభ్యర్థులను త్రిసూర్ లో బరిలోకి దించాయి. ఇక్కడ యూడీఎఫ్ అభ్యర్థిగా పద్మజ వేణుగోపాల్ ఉన్నారు. ఆమె కాంగ్రెస్ సీనియర్ నేత కరుణాకరన్ కుమార్తె. ఎల్.డి.ఎఫ్ తరుపున బాలచంద్రన్ బరిలో ఉన్నారు. ఈయన కూడా బలమైన అభ్యర్థి కావడంతో సురేష్ గోపీకి కొంత కష్టంగానే కనపడుతుంది.
కాంగ్రెస్ కంచుకోట….
కానీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అభ్యర్థులు బలమైన వారు కావడంతో ఓట్లు చీల్చుకుంటే తన గెలుపు ఖాయమని సురేష్ గోపీ భావిస్తున్నారు. త్రిసూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. త్రిసూర్ లో కాంగ్రెస్ పార్టీ 1991 నుంచి 2011 వరకూ జరిగిన ఐదు ఎన్నికల్లో వరసగా గెలిచింది. 2016 లో ఈ స్థానాన్ని సీపీఐ దక్కించుకుంది. మొత్తానికి కాంగ్రెస్ కంచుకోటలో సురేష్ గోపీ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.